Share News

PARKING : పెద్దాసుపత్రిలో మల్టీలెవల్‌ పార్కింగ్‌..!

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:59 AM

జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఎట్టకేలకు వాహనాల పార్కింగ్‌ సమస్యకు పరిష్కారం చూశారు. నిత్యం వందల మంది రోగులు చికిత్స కోసం వివిధ రకాల వాహనాల్లో ఆస్పత్రికి వస్తున్నారు. మరోవైపు డాక్టర్లు, సిబ్బంది వందల మంది పనిచేస్తున్నారు. డాక్టర్లు అధికంగా సొంతకార్లలో విధులకు వస్తారు. అయితే వాహనాల పార్కింగ్‌కు సరైన స్థలం లేకపోవడంతో ఆస్పత్రిలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలిపి వెళుతున్నారు.

PARKING : పెద్దాసుపత్రిలో మల్టీలెవల్‌ పార్కింగ్‌..!
Multi-level parking area

- పెద్ద నగరాల్లో తరహాలో మూడు ఫ్లోర్లు

- ఒక్కో ఫ్లోర్‌లో 9 నుంచి 10 కార్లకు అవకాశం

- ఇంజినీర్ల ప్లానకు కలెక్టర్‌ ఆమోదం

అనంతపురంటౌన, మార్చి 27(ఆంధ్రజ్యోతి): జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఎట్టకేలకు వాహనాల పార్కింగ్‌ సమస్యకు పరిష్కారం చూశారు. నిత్యం వందల మంది రోగులు చికిత్స కోసం వివిధ రకాల వాహనాల్లో ఆస్పత్రికి వస్తున్నారు. మరోవైపు డాక్టర్లు, సిబ్బంది వందల మంది పనిచేస్తున్నారు. డాక్టర్లు అధికంగా సొంతకార్లలో విధులకు వస్తారు. అయితే వాహనాల పార్కింగ్‌కు సరైన స్థలం లేకపోవడంతో ఆస్పత్రిలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలిపి వెళుతున్నారు. అత్యవసర కేసులు వచ్చినపుడు క్యాజు వాలిటీకి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఇంకోవైపు వాహనాల దొంగతనాలు అధికంగానే జరుగుతున్నాయి. రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు ఆస్పత్రికి వచ్చినపుడు ఇక్కడి పరిస్థితిని చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించి వెళ్లఢం చాలా ఏళ్లుగా జరుగుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పార్కింగ్‌ ఏర్పాటు వ్యవహారాన్ని నగరపాలక సంస్థకు అప్పగించారు.

మూడు ఫ్లోర్ల ఏర్పాటు

ఆస్పత్రిలో స్థల సమస్య ఉండడంతో ఇంజినీర్లు పెద్ద పెద్ద నగరాలలో మాదరిగా మల్టీలెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇంజినీర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్లానను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆమోదించారు. దీంతో వారం కిందట నగరపాలక ఇంజినీర్లు, వైద్య విభాగం ఏపీఎంఎ్‌సఐడీసీ ఇంజినీర్లు ఆస్పత్రిలో మల్టీలెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ప్రస్తుతం డాక్టర్లు కార్లు నిలబెడతున్న ప్రాం తంలో ఇందుకోసం మూడుఫ్లోర్లు నిర్మించాలని వారు ప్లాన వేశారు. దీని ప్రకారం ఒక్కో ఫ్లోర్‌లో 9నుంచి 10కార్లు పార్కింగ్‌చేయడానికి అవకాశం ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 28 , 2025 | 12:59 AM