కబ్జాదారులను అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2023-01-24T00:48:51+05:30 IST

సోమందేపల్లి మండలంలో ఎస్టీల భూములను కబ్జాచేసిన ఏపీఐఐసీ చైర్మన మెట్టు గోవిందరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో బాధితులు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు.

కబ్జాదారులను అరెస్టు చేయాలి
నిరసనకారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత కుమార్‌

ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి

కలెక్టరేట్‌ వద్ద నిరసన

పుట్టపర్తి రూరల్‌, జనవరి 23: సోమందేపల్లి మండలంలో ఎస్టీల భూములను కబ్జాచేసిన ఏపీఐఐసీ చైర్మన మెట్టు గోవిందరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో బాధితులు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ మాట్లాడుతూ.. సోమందేపల్లి మండలంలోని పాలసముద్రం సర్వే నెంబరు 99లో 7 ఎకరాల ప్రభుత్వ భూమి ఎస్టీలకు చెందినదనీ, ఈ భూమిని కబ్జాచేసి దౌర్జన్యంగా నిర్మాణాలు చేపడుతున్న ఏపీఐఐసీ చైర్మన మెట్టు గోవిందరెడ్డి, వైసీపీ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరు బసంతకుమార్‌.. వారి వద్దకు వచ్చి, మాట్లాడారు. విచారణ చేసి, న్యాయం చేస్తామనీ, అవసరమైతే వివాదాస్పద భూమి వద్ద 144 సెక్షన అమలుకు తహసీల్దార్‌కు అదేశాలిస్తామని తెలిపారు. దీంతో నిరసన విరమించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌ వెంకటేశులు, నాయకులు, బాధితులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T00:48:54+05:30 IST