Ap Govt: పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు డీఆర్ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు
ABN , First Publish Date - 2023-10-22T21:06:16+05:30 IST
పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు డీఆర్ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు డీఆర్ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకటించిన డీఆర్ నవంబర్ 2023 జీతంతో పాటు డిసెంబర్ నెలలో చెల్లించాలని ఆదేశించారు. ఈడీఆర్‌ను డిసెంబర్లో చెల్లించే జీతంతో కలిపి చెల్లించాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. డీఆర్ బకాయిలు జూలై 1,2022 నుంచి అక్టోబర్ 31- 2023 వరకు మూడు సమాన వాయిదాలలో చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.
వీటిని మరింత ఆలస్యం చేస్తూ 2024 ఏప్రిల్, జూలై, అక్టోబర్లో చెల్లించాలని జీవోలో వెల్లడించారు. గత ప్రభుత్వాల హయాంలో త్వరలో డీఆర్ చెల్లిస్తామంటూ జీవోలు ఇస్తే అవి పోస్ట్ డేటెడ్ చెక్కులని వైసీపీ విమర్శించింది. అధికారంలోకి వచ్చాక వైసీపీ పోస్ట్ డేటెడ్ జీవోలు ఇస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.