Atchannaidu: మహానాడు సాక్షిగా టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన అచ్చెన్నాయుడు..!

ABN , First Publish Date - 2023-05-27T12:35:03+05:30 IST

జగనేమో పేద వాడంట.. చంద్రబాబేమో ధనవంతుడట. జగన్ అబద్ధాల కోరు. 28 రాష్ట్రాల సీఎంలకు రూ. 508 కోట్లు ఉంటే.. జగన్ ఒక్కడికే అంత ఆస్తి ఉంటుంది. 30 కేజీలున్న జగన్‌కు ఏడు బంగళాలు కావాలంట. బెంగళూరు, ఇడుపులపాయ, లోటస్ పాండ్, అమరావతిలో ప్యాలెస్ ఎవరిది..? ఇప్పుడేమో

Atchannaidu: మహానాడు సాక్షిగా టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన అచ్చెన్నాయుడు..!
Atchannaidu

రాజమండ్రి: వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలను టీడీపీ గెలుచుకోవడం ఖాయమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమండ్రి మహానాడు (Mahanadu)లో ఆయన ప్రసంగించారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. టీడీపీది (TDP) ఎప్పుడూ ప్రజాపక్షమే అన్నారు. 2019లో ఓ దోపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారన్నారు. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. కాకపోతే చేసిన పనులను చెప్పుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో తెలుగుదేశాన్ని ఎదుర్కోలేకే.. జగన్ కోడి కత్తి డ్రామా.. సొంత బాబాయ్‌ని చంపి ప్రజల సానుభూతితో ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. జగన్‌ను వేటాడి.. వెంటాడి తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. 151 స్థానాలు రావడంతో జగన్ కళ్లు నెత్తికెక్కి ఒళ్లు మదమెక్కిందని మండిపడ్డారు.

‘‘ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలు జగన్‌ను ఛీకొడుతున్నారు. ఈ మధ్య సీఎం జగన్ (CM JAGAN) నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. జగనేమో పేద వాడంట.. చంద్రబాబేమో ధనవంతుడట. జగన్ అబద్ధాల కోరు. 28 రాష్ట్రాల సీఎంలకు రూ. 508 కోట్లు ఉంటే.. జగన్ ఒక్కడికే అంత ఆస్తి ఉంటుంది. 30 కేజీలున్న జగన్‌కు ఏడు బంగళాలు కావాలంట. బెంగళూరు, ఇడుపులపాయ, లోటస్ పాండ్, అమరావతిలో ప్యాలెస్ ఎవరిది..? ఇప్పుడేమో ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తానంటూ విశాఖలో రాజధాని పెట్టి అక్కడో ఇల్లు కడతాడంట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోనే కాదు.. పులివెందులలో కూడా కర్రు కాల్చి వాత పెట్టారు. చంద్రబాబు కట్టిన టిడ్కో ఇళ్లను పక్కన పెట్టేసి సెంటు పట్టా ఇచ్చారు. నాలాగా పొడవుగా ఉండే వాడికి సెంటు పట్టా సరిపోతుందా..? గతంలో ఇంటి ఖర్చు ఎంతైంది..? ఇప్పుడు ఎంతైందో ఆలోచించండి. వివేకా హత్య విషయంలో మేం చెప్పిందే సీబీఐ చెప్పింది. వివేకా చనిపోయిన విషయం జగన్‌కే ముందు తెలిసింది. బాబాయ్ హత్య కేసు తమ మీదకు వస్తుందని జగన్ భయపడుతున్నారు. రూ. 2 వేల నోటు రద్దుతో తన దగ్గరున్న నోట్లను ఏం చేయాలో తెలియక జగన్ తల పట్టుకున్నారు. ఇక లోకేష్ పాదయాత్ర అద్భుతంగా జరుగుతోంది. ఓ ఆశయం గురించి 48 డిగ్రీల ఎండలో లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. మహానాడుకు ప్రభుత్వం బస్సులు ఇవ్వకుండా రాకుండా చేశారు. మహానాడు కోసం అలంకరణ చేస్తే.. జగన్ బ్లేడ్ బ్యాచ్.. ఫ్లెక్సీలను బ్లేడ్లతో కోసేశారు.’’ అంటూ అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు.

Updated Date - 2023-05-27T12:49:16+05:30 IST