జోరుగా కోడిపందేలు, గుండాట
ABN , First Publish Date - 2023-01-15T00:28:35+05:30 IST
పండుగ వేళ కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసుల హెచ్చరికలు బేఖాతరయ్యాయి. ఎక్కడిక్కడ పందేలు, జూదాలు జోరుగా సాగాయి. పందెంరాయుళ్ల పంతం నెగ్గింది. పిఠాపురం తోపాటు పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో పలు

పోలీసుల హెచ్చరికలు బేఖాతరు
వెనక్కి తగ్గని పందెంరాయుళ్లు
పిఠాపురం, జనవరి 14: పండుగ వేళ కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసుల హెచ్చరికలు బేఖాతరయ్యాయి. ఎక్కడిక్కడ పందేలు, జూదాలు జోరుగా సాగాయి. పందెంరాయుళ్ల పంతం నెగ్గింది. పిఠాపురం తోపాటు పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి కోడిపందేలు జోరుగా సాగాయి. పందేల బరికి సమీపంలోనే గుండాట, జూదాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. పిఠాపురంతో పాటు మండలంలోని బి.ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, పి.తిమ్మాపురం, పి.దొంతమూరు, మల్లాం, జల్లూరు, మాధవపురం, నవఖండ్రవాడ, చిత్రాడ తదితర గ్రామాలు, గొల్లప్రోలు మండలంలోని ఏకే మల్లవరం, తాటిపర్తి, చెందుర్తి, కొడవలి, చినజగ్గంపేట, చేబ్రోలు తదితర గ్రామాల్లో పందేలు జరిగాయి. జూదాల వద్ద్ద భారీగా సొమ్ములు చేతులు మారుతున్నాయి. మరోవైపు కోస మాంసానికి గిరాకీ పెరిగింది