వేస్ట్.. కాదు సుమా!
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:29 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక మునిసిపాలిటీల్లో వందల టన్నుల చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. నిత్యం వచ్చే వందల టన్నుల చెత్తను ఒక చోటకు చేర్చి దీని నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది..

చెత్తతో విద్యుత్ వెలుగు
రూ.370 కోట్లతో ప్లాంట్
బిక్కవోలులో ఏర్పాటుకు ఓకే
టెండర్లు పిలిచిన సర్కారు
ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహణ
22 మునిసిపాలిటీల నుంచి చెత్త
ఉభయగోదావరి జిల్లాలకు ఇక్కడే
రోజుకు 950 టన్నులు
12 మెగావాట్ల విద్యుదుత్పత్తి
ప్రజల తీవ్ర అభ్యంతరం
గ్రాసిం పరిశ్రమతోనే ఇబ్బందులు
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక మునిసిపాలిటీల్లో వందల టన్నుల చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. నిత్యం వచ్చే వందల టన్నుల చెత్తను ఒక చోటకు చేర్చి దీని నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది..అటు జనానికి చెత్త సమ స్య తీర్చడం..ఇటు కొండల్లా పోగయ్యే చెత్తను కనుమరుగు చేసి ప్రజలకు ఉపయోగపడేలా విద్యుదుత్పత్తి చేసేలా రూ.370 కోట్లతో చెత్త నుంచి విద్యుత్ తయారీ యూనిట్ నెలకొల్ప బోతోంది. కాకినాడ-రాజమహేంద్రవరం క్లస్టర్‌లో దీని ఏర్పాటుకు వీలుగా ప్రైవేటు సంస్థలను ఆహ్వానించింది. అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం కాపవరం, బలభద్రపురం లో గ్రామాల్లో ప్రాజెక్టుకు స్థలాలు గుర్తించడంతో ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పటికే ఇక్కడ జనం గ్రాసిం కంపెనీ కాలుష్యంతో ఇబ్బంది పడుతుంటే చెత్తంతా ఇక్కడకు తేవ డం సరికాదని స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి, అటు జనం వ్యతిరేకిస్తున్నారు. పెద్దాపురంలో స్థలం అనువుగా ఉన్నా ఎందుకు ఇక్కడే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్లాంట్ ఖర్చంతా ప్రైవేటుదే..
12 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్‌కు రూ. 370 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా ప్రైవేటు కంపెనీయే భరించేలా ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది.ఈ మేరకు టెండర్లు పిలిచింది. ఎంపికైన సంస్థ ఈ మొత్తం భరిస్తే ప్రభుత్వం తరపున చెత్త ఇవ్వడం, ఉత్పత్తయిన విద్యుత్ 25 ఏళ్ల పాటు సదరు కంపెనీయే సొంతంగా విక్రయిం చుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వానికి ఏ మాత్రం భారం లేకుండా రెండు కార్పొరేష న్లు, 10 ముని సిపాలిటీల్లో చెత్తంతా బయటకు వెళ్లిపోనుంది.ఈ ప్రాజెక్టు ఆరంభమైతే 22 కార్పొరేషన్లు, మునిసి పాలిటీల్లో చెత్త సమస్యకు చెక్ పడనుంది.ఈ ప్రాజెక్టుకు అనపర్తి నియో జకవర్గం బిక్కవోలు మండలం కాపవరంలో 12 ఎకరాలు,బలభద్రపురంలో 20 ఎకరాలను అధికా రులు ఎంపిక చేశారు.12 ఎకరాల్లో విద్యుత్ ప్లాంట్, 20 ఎకరాల్లో చెత్తంతా వేసి విద్యుదు త్పత్తికి అనువుగా మార్చడం చేయనున్నారు.ఈ నెల 8న మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
రోజుకు 950 టన్నుల చెత్త..
ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జి ల్లాల్లో 22 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను కలి పి కాకినాడ- రాజమహేంద్రవరం క్లస్టర్‌గా ప్ర భుత్వం ప్రతిపాదించింది. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు 12 ఉన్నాయి. ఉభయ గోదా వరి జిల్లాల్లో కలిపి రోజుకు 950 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది.అత్యధికంగా ఉమ్మడి తూ ర్పు నుంచి ఉత్పత్తి అవుతుంది. కాకినాడ కార్పొ రేషన్‌లో రోజుకు 144 టన్నులు, రాజమహేంద్ర వరం కార్పొరేషన్ 160, పిఠాపురం 26, పెద్దాపు రం 25, సామర్లకోట 23, రామచంద్రపురం 23, మండపేట 26, ముమ్మిడివరం 11,అమలా పు రం మునిసిపాలిటీలో 30,కొవ్వూరు, నిడదవోలు మునిసిపాలిటీల పరిధిలో టన్నుల కొద్దీ చెత్త రోజువారీ వస్తోంది.ఈ చెత్తం టినీ ఒక చోట చేరిస్తే రోజుకు 12 మెగా వాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చని అధికారులు తేల్చారు.
ప్రాజెక్టుపై వ్యతిరేకత..
ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రదేశంపై తీవ్ర అభ్యం తరాలు వ్యక్తమవుతున్నాయి.కాపవరం, బల భద్రపురం గ్రామాల్లో 22 కార్పొరేషన్లు, ముని సిపాలిటీల నుంచి తెచ్చిన చెత్తంతా వేస్తే జనం ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఊరు చుట్టూ వందల్లో చెత్త లారీలు తిరిగితే జనం ఇబ్బందులు పడతారని అంటున్నారు. ఇప్పటి కే గ్రాసిం పరిశ్రమ కాలుష్యంతో నరక యా తన పడుతున్న జనానికి ఇది మరో ముప్పు అని ధ్వజమెత్తుతున్నారు. అటు చెత్త నుంచి విద్యుదుత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయవద్దం టూ కాపవరం, బలభద్రపురం పంచాయతీలు సైతం ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ ప్రాజె క్టుకు అనువైన భూమి పెద్దాపురంలో గుర్తిం చిన అధికారులు మళ్లీ బిక్కవోలు వైపు చూ డడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాప వరం,బలభద్రపురానికి సమీపంలో చెత్త నుం చి తయారయ్యే విద్యుత్ గ్రిడ్‌కు అనుసం ధా నించుకునేలా విద్యుత్‌లైన్ ఉండడం వల్ల మొ గ్గుచూపుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.