స్ఫూర్తి ప్రదాత భగత్‌సింగ్
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:37 AM
అసమానతలు లేని సమాజం కోసం భగత్‌సింగ్ స్ఫూర్తితో పోరాడాలని ఏపీఆర్‌సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా, భారతీయుల విముక్తి కోసం ప్రాణాలర్పించిన యువ కిశోరాలు షాహిద్ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల వర్ధంతిని పలుచోట్ల ఆదివారం నిర్వహించారు.

అసమానతలు లేని సమాజం కోసం పోరాడాలి
ఏపీఆర్‌సీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజబాబు
స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు నివాళి
రంగంపేట, మార్చి 23(ఆంధ్రజ్యోతి): అసమానతలు లేని సమాజం కోసం భగత్‌సింగ్ స్ఫూర్తితో పోరాడాలని ఏపీఆర్‌సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా, భారతీయుల విముక్తి కోసం ప్రాణాలర్పించిన యువ కిశోరాలు షాహిద్ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల వర్ధంతిని పలుచోట్ల ఆదివారం నిర్వహించారు. రంగంపేట మండలం సింగంపల్లిలోని సీపీ రెడ్డినగర్ కాలనీలో ఏపీ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, ప్రగతిల మహిళా సంఘం (స్ర్తీవిముక్తి) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఏపీఆర్‌సీఎస్ నాయకుడు చెక్క సత్తిబాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో రాజబాబు మాట్లాడారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లు నూ నుగు మీసాల వయస్సు దేశం కోసం ఉరికొయ్యను ముద్దాడి తమ ప్రాణాలను స్వతంత్ర ఉద్యమాన్ని రగిలించేందుకు బలిదానం చేశారని, వారి త్యాగం ఎనలేనిదని కొనియాడారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు మతోన్మాద రాజకీయాలు చేస్తూ ప్రజల్ని అసలు సమస్యల నుంచి పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. పీడిత, తాడిత ప్రజలు కులమతాలకు అతీతంగా భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తితో మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎఫ్‌టీయూ నాయకులు బంగా రు ప్రసాద్, ఏపీఆర్‌సీఎస్ నాయకుడు డి.సురేష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు నర్లా లక్ష్మీదేవి, చెక్క రమాదేవి పాల్గొన్నారు.