కేన్సర్‌పై తప్పుడు నివేదికలు ఇవ్వొద్దు
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:32 AM
బిక్కవోలు మండలం బలభద్రపురంలో కేన్సర్ బాధితులను కనుగొనేందుకు నిర్వహిస్తున్న సర్వే పారదర్శకంగా సాగాలని తప్పుడు నివేదికలు ఇచ్చి సమస్య తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నించవద్దని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

అనపర్తి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : బిక్కవోలు మండలం బలభద్రపురంలో కేన్సర్ బాధితులను కనుగొనేందుకు నిర్వహిస్తున్న సర్వే పారదర్శకంగా సాగాలని తప్పుడు నివేదికలు ఇచ్చి సమస్య తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నించవద్దని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం వద్ద ఆదివారం ఎమ్మెల్యే వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో సర్వేపై సమీక్షించారు. అసెంబ్లీలో కేన్సర్ తీవ్రతపై తాను ప్రస్తావించడంతో సీఎం చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌లు స్పందించి ప్రత్యేక వైద్య శిబిరంతో పాటు సమగ్ర సర్వేకు ఆదేశాలు జారీ చేశారన్నారు.సర్వే జరుగుతుండగానే స్ర్కీనింగ్ టెస్టులు లేకుండా బాధితుల సంఖ్య ఎలా నిర్ధారిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే ప్రారంభమైన రోజునే 23 మంది కేన్సర్ రోగులు ఉన్నారని ఉన్నతాధికారులకు ఏవిదంగా నివేదిస్తారని ప్రశ్నించారు. సర్వే పూర్తయ్యేవరకు స్వయంగా తానే పర్యవేక్షిస్తానని తెలిపారు.గ్రామస్తులు ఇంటింటా సర్వేకు వచ్చిన సిబ్బందికి ఆరోగ్యపరమైన సమస్యలను దాచుకోకుండా చెప్పాలని సూచించారు. ఎమ్మె ల్యే వెంట డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు, హెచవోడీ పి.సుజాత, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ డైరెక్టర్ పద్మావతి, ఎంపీడీవో ఎం.రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.