గోదారి..గొంతు తడారి!
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:25 AM
గోదావరి చెంతనే ఉన్నా ప్రజల గొంతు తడారిపోతోంది.. గుక్కెడు నీటికి ఎన్నో ఇబ్బం దులు.. ఇదీ ఇటు రాజమహేంద్రవరం.. అటు కొవ్వూరు పరిస్థితి.వేసవి ఆరంభంలోనే ప్రజలు దాహం కేకలు వేస్తున్నారు.

వేసవి ఆరంభంలోనే ఇక్కట్లు
గోదారి చెంతనే దాహం కేకలు
రాజమండ్రిలో శివారున ఇక్కట్లు
కొవ్వూరుకు అందనే అందవు
దశాబ్దాలుగా హామీలతోనే సరి
దేవరపల్లిలో నీటికి ఆందోళన
గోదావరి చెంతనే ఉన్నా ప్రజల గొంతు తడారిపోతోంది.. గుక్కెడు నీటికి ఎన్నో ఇబ్బం దులు.. ఇదీ ఇటు రాజమహేంద్రవరం.. అటు కొవ్వూరు పరిస్థితి.వేసవి ఆరంభంలోనే ప్రజలు దాహం కేకలు వేస్తున్నారు. గత దశాబ్ద కాలంగా అన్ని ప్రాంతాలకు గోదావరి జలాలను అందిస్తామని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. నేటికి ఆ ప్రతిపాదనలు అమలులోనే ఉన్నాయి. కనీసం గోదావరి చెంతనే ఉన్న ప్రాంతాలకు నదీజలాలు అందడం లేదు. మిగిలిన ప్రాంతాలకు పైపులైను వేసి ఎప్పటికి అం దిస్తారో ఆలోచించాల్సిందే మరి.
రాజమహేంద్రవరంలో శివారుకు తప్పని
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 23 ( ఆం ధ్రజ్యోతి): రాజమహేంద్రవరం శివారు ప్రాం తాలకు తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. అటువంటి ప్రాంతాలకు నగరపాలక సంస్థ వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీరందిస్తున్నారు.నగరంలో ఆనంద్‌నగర్, టీచర్స్ కాలనీ, వెంకటాపురం శివారు ప్రాంతాలు, క్వారీలోని సింహాచల్‌నగర్,9వ డివిజన్‌లో వెంకటేశ్వనగర్, బర్మాకాలనీల్లో కొంత సమస్యవుంది. వెంకటేశ్వరనగర్‌లో వాటర్ ట్యాంక్ పనులు పూర్తి చేస్తే నీటి సమస్య అధిగమించవచ్చు. మిగిలిన చోట్లకు నగరపాలక సంస్థ వాటర్ ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు.ఈ వేసవిలో నీటి ఎద్దడిని అదిగమించేందుకు నగరపాలక సంస్థ కసరత్తు చేస్తుంది.మిగిలిన ప్రాంతాల ప్రజలకు తాగునీటి ఇబ్బందుల్లేకుండా రోజుకు రెండు పూటలా కార్పొరేషన్ అధికారులు నీటిని సరఫరా చేస్తు న్నారు. నగరంలో 50 డివిజన్లలో సుమారు 5 లక్షల మంది జనాభా ఉన్నారు.75 వేల గృ హా లు,20 వేల వ్యాపార సంస్థలు ఉన్నాయి. నగరంలో ప్రధాన మంచినీటి విభాగం ద్వారా 50 ఎంఎల్‌డీ వాటర్, టింబర్ యార్డులో ఉన్న 10 ఎంఎల్‌డీ వాటర్ ప్లాంట్ నుంచి, ఆల్‌కట్ గార్డెన్స్ శివారు ధవళేశ్వరం రోడ్డులో ఉన్న మరొక 10ఎంఎల్‌డీ వాటర్ ప్లాంట్‌ల ద్వారా 20 ఎంఎల్‌డీ వాటర్ కలిసి మొత్తం 74.742 ఎంఎల్‌డీ వాటర్‌ను తయారు చేస్తున్నారు. దీనికి ఆలమ్, క్లోరినేషన్, ఫిల్టర్‌బెడ్ తదితర ప్రక్రియలు పూర్తిచేసి ప్రజలకు సరఫరా చేయడానికి నగరపాలక సంస్థకు ఏడాదికి రూ.20 కోట్లు ఖర్చవుతుంది. నగరపాలక సంస్థకు నీటి చార్జిల రూపేణా వచ్చే ఆదాయం రూ.12 కోట్లు .నగరంలో ప్రతి వ్యక్తికి సగటున రోజుకు 130 లీటర్ల తాగునీరు సరఫరా చేస్తున్నారు. నగరపరిధిలో రెండు పూటల తాగునీరందిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో మాత్రం నేటికీ తాగునీటి ఎద్దడి కనిపిస్తుంది.
కొవ్వూరుకు బోరు నీరే ఆధారం
కొవ్వూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : అఖండ గౌతమి గోదావరి కొవ్వూరు పట్టణాన్ని ఆనుకుని ఉంది. ఎక్కడో మహారాష్ట్రలోని నాసిక్ వద్ద పుట్టిన గోదావరి నది వేల కిలోమీటర్లు ప్రవహించి కొవ్వూరు చేరుకుంటుంది. ఇక్కడ నుంచి అఖండ గోదావరి ఏడుపాయలు గా విడిపోయి ఉభయ గోదావరి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీటిని అందిస్తూ ఎంతో మంది అవసరాలు తీరుస్తుంది. అయితే పాలకులు అఖండ గోదావరి ఒడ్డున ఉన్న కొవ్వూరు తీరాన్ని మాత్రం మర్చిపోయారు.కొవ్వూరు నియోజకవర్గం ఏర్పడి 6 దశాబ్దాలు దాటుతున్నా నేటికి పట్టించుకున్న పాలకులు లేరు. దీంతో వేసవి వచ్చిందంటే ప్రజలు గుక్కెడు నీటికి ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. కొవ్వూరు పట్టణంలో సుమారు 50 వేలకు ఫైగా జనాభా ఉన్నారు. నియోజకవర్గంలో 53,000 ఎకరాల సాగుభూమి ఉంది. గోదారి చెంతనే ఉన్నా తాగు, సాగు నీటికి బోరు నీరే ఆధారం. కొవ్వూరు పట్టణంలో 12,569 గృహాలు, 50 వేలకు పైగా జనాభా ఉన్నారు. వీరికి పురపాలక సంఘం ప్రతి రోజు రెండుపూటలా పట్టణంలో 4.5 ఎంఎల్‌డీ తాగునీటిని సరఫరా చేస్తుంది. ఒక్కొక్క పూటకు 22.50 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలో కుళాయి పన్నుల రూపంలో మునిసిపాలిటీకి రూ.57 లక్షలు ఆదాయం వస్తుండగా ప్రజలకు తాగునీరందించడానికి ఏడాదికి సుమారు రూ. 2.03 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వేసవిలో 15వ వార్డు బ్రిడ్జిపేట, ఒకటో వార్డు ఆర్టీసీ కాలనీలతో పాటు ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జగనన్న కాలనీలకు తాగునీటి ఎద్దడి తప్పడం లేదు. దీంతో మునిసిపల్ వాటర్ ట్యాంకుతో పాటు, 4 ట్యాంకర్లను అద్దెకు తీసుకుని పట్టణంలోని 4 జగనన్నకాలనీలకు నీటిని సరఫరా చేస్తున్నారు. కొత్త ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణంతో ఏఐఐబీ పథకంలో చేపట్టిన తాగునీటి పథకాన్ని పూర్తిచేస్తే తాగునీటి సమస్య తీరుతుంది.
గోదావరి నీరు సరఫరాకు చర్యలు
కొవ్వూరు పట్టణ ప్రజలకు గోదావరి జలాలను అందించేందుకు రూ.58 కోట్లతో పనులు చేపట్టాం.బిల్లులు మంజూరుకాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే నిలుపుదల చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెరిగిన ధరలు రూ. 70 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి.టెండర్లు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
- టి.నాగేంద్రకుమార్,కమిషనర్, కొవ్వూరు
తాగునీటికి రోడ్డెక్కారు!
దేవరపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : తాగు నీరివ్వాలని రోడ్డెక్కారు.. ఆందోళన చేశారు. దేవర పల్లిలో ఇందిరమ్మ కాలనీకి గత వారం రోజు లుగా నీరందకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీంతో ఆదివారం మహిళలు భారీ ఎత్తున రోడ్డు పైకి వచ్చి ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. వీరికి మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు సుంకర దుర్గారావు మ ద్దతుగా నిలిచి పంచాయతీ అధికారులను నిల దీశారు.దేవరపల్లి మండలంలో తాగునీటికి ఎప్పు డు సమస్యలేదని.. ఇందిరమ్మ కాలనీలో 40 వేల లీటర్ల వాటర్ ట్యాంకు ఉందని తెలిపారు. కావాలని నీటి సమస్య సృష్టిస్తున్నారని ఆరోపిం చారు.ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం సంఘ టన ప్రాంతానికి చేరుకుని కాలనీవాసులకు నచ్చ జెప్పారు.తాగునీరు సక్రమంగా సరఫరా చే యా లని కార్యదర్శి ఎన్.రవికిషోర్‌కు సూచించారు.
నీటి సరఫరాలో ఇబ్బందులుంటే డయల్ 91001 21190
ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ గిరి
రాజమహేంద్రవరం రూరల్ మార్చి 23(ఆంధ్రజ్యోతి): రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం రాకుండా తగు చర్యలు చేపడు తున్నట్టు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బీవీ.గిరి ఒక ప్రకటనలో తెలిపారు.గ్రామీ ణ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంత రాయం ఏర్పడితే 91001 21190 నెం బరుకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫిర్యాదు చేయ్యవచ్చన్నారు. జిల్లాలో 141 హ్యాండ్ పంపులు,59 సూక్ష్మ నీటి సరఫరా పఽథకాలు మరమ్మతులు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల పరిధి లోని 482 నివాస ప్రాంతాలకు చెందిన 14.74 లక్షల మందికి ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా తాగునీరు సరఫరా చేయడం జరు గుతుందన్నారు.ఈ మేరకు 2,116 చేతి పంపులు, 308 సూక్ష్మ రక్షిత నీటి సరఫరా పథకాలు,601 ప్రజానీటి సరఫరా పథ కాలు 5 సామాజిక ప్రజా నీటి సరఫరా పథకాలు జిల్లాలో నిర్వహిస్తున్నట్టు తెలి పారు. గోదావరి నుంచి నీటిని సరఫరా చేయాలని ప్రతిపాదనలు వచ్చాయన్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం జల్‌జీవన్ మిషన్ ప్రాజెక్టుల కింద నాలుగు స్థా నాలను గుర్తించడం జరిగిందన్నారు. కాకినాడ నుంచి కోనసీమ జిల్లాల్లో కొంత భాగంతో పాటు రాజమహేంద్రవరం రూ రల్, కడియం బిక్కవోలు, అనపర్తి మం డలాలను కవర్ చేసే విధంగా ధవళేశ్వరం వద్ద రూ.1650 కోట్ల అంచనా, విజ్జేశ్వరం వద్ద పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పాటు, ఉండ్రాజవరం, పెర వలి, నిడదవోలు, చాగల్లు, కొవ్వూరు, తాళ్ళపూడి మండలాల్లో రూ. 1400 కోట్ల వ్యయంతో రెండు పనులకు సంబంధించి టెండర్లు పిలిచారన్నారు. వచ్చే నెలలో ప నులు ప్రారంభమవుతాయన్నారు. భవి ష్యత్‌లో అన్ని మండలాలకు గోదావరి నీరందించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు.