Peethala Sujatha: అంగన్‌వాడీల సమ్మెపై జగన్ ప్రభుత్వం స్పందించాలి
ABN , Publish Date - Dec 26 , 2023 | 03:30 PM
అంగన్‌వాడీల సమ్మెపై జగన్ ప్రభుత్వం స్పందించాలని టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. రంగంపేట మండలంలో అంగన్వాడీ టీచర్ పుష్పకుమారిని లైంగికంగా వేధించిన వైసీపీ ఎంపీటీసీ గోలి వెంకట కృష్ణను కఠినంగా శిక్షించాలని పీతల సుజాత అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా: అంగన్‌వాడీల సమ్మెపై జగన్ ప్రభుత్వం స్పందించాలని టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. రంగంపేట మండలంలో అంగన్వాడీ టీచర్ పుష్పకుమారిని లైంగికంగా వేధించిన వైసీపీ ఎంపీటీసీ గోలి వెంకట కృష్ణను కఠినంగా శిక్షించాలని పీతల సుజాత అన్నారు. బాధితురాలు పుష్పకుమారికి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. వైసీపీ పాలనలో దళితులకు, మహిళలకు రక్షణ కరువైందని ఆమె మండిపడ్డారు.