Jagan : ఫేస్ ప్యాకుల బిజినెస్‌కి తెరదీసిన జగన్ ప్రభుత్వం.. పొదుపు మహిళలను బెదిరిస్తూ..
ABN , First Publish Date - 2023-11-24T08:07:00+05:30 IST
ఉన్న బిజినెస్‌లు సరిపోవని... తాజాగా ఫేస్ ప్యాకుల బిజినెస్‌కి జగన్ ప్రభుత్వం తెరతీసింది. పొదుపు మహిళలని బెదిరిస్తూనో.. భయపెడుతూనో వారితో ఈ బిజినెస్ చేయిస్తోంది. రుణాలు రావని, వడ్డీలు పడవని పొదుపు మహిళలను ప్రభుత్వం బెదిరిస్తోందని సమాచారం. ఒక్కో గ్రూపు కచ్చితంగా రెండు ప్యాకులు కొనుగోలు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

నెల్లూరు : ఉన్న బిజినెస్‌లు సరిపోవని... తాజాగా ఫేస్ ప్యాకుల బిజినెస్‌కి జగన్ ప్రభుత్వం తెరతీసింది. పొదుపు మహిళలని బెదిరిస్తూనో.. భయపెడుతూనో వారితో ఈ బిజినెస్ చేయిస్తోంది. రుణాలు రావని, వడ్డీలు పడవని పొదుపు మహిళలను ప్రభుత్వం బెదిరిస్తోందని సమాచారం. ఒక్కో గ్రూపు కచ్చితంగా రెండు ప్యాకులు కొనుగోలు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. మెప్మా, డీఆర్డీఏ అధికారులు, ఉద్యోగులు ఫేస్ ప్యాకుల వ్యాపారాల్లో మునిగితేలుతున్నారు. రూ.కోట్లలో ఊరూపేరూ లేని ఫేస్ ప్యాకుల అమ్మకాలు జరుగుతున్నాయి. చర్మవ్యాధులు వస్తున్నాయంటూ పొదుపుగా మహిళలు గగ్గోలు పెడుతున్నారు. కూలి పనులు చేసి దాచుకున్న డబ్బుని ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.