మహాశివరాత్రికి 1089 ప్రత్యేక బస్సులు
ABN , First Publish Date - 2023-02-10T23:51:35+05:30 IST
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ కడప జోన్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల శైవ క్షేత్రాలకు 1,089 ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ ఈడీ గోపీనాథరెడ్డి తెలిపారు. ఆ మేరకు శుక్రవారం కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కడప(మారుతీనగర్): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ కడప జోన్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల శైవ క్షేత్రాలకు 1,089 ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ ఈడీ గోపీనాథరెడ్డి తెలిపారు. ఆ మేరకు శుక్రవారం కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లా నుంచి 256 బస్సులు, నంద్యాల జిల్లా నుంచి 221 బస్సులు, కడప జిల్లా నుంచి 251 బస్సులు, అన్నమయ్యజిల్లా నుంచి 159 బస్సులు, అనంతపురం జిల్లా నుంచి 5 బస్సులు, చిత్తూరు జిల్లానుంచి 53 బస్సులు, శ్రీ సత్యసాయి జిల్లానుంచి 8 బస్సులు, తిరుపతి జిల్లానుంచి 136 బస్సులను భక్తుల కోసం ఏర్పాటు చేశామన్నారు. రాయలసీమ జిల్లాల్లోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని, భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.