అద్భుతంగా గండి ఆలయ నిర్మాణం
ABN , First Publish Date - 2023-01-16T23:36:12+05:30 IST
సమగ్ర యాజమాన్యంతో బొప్పాయి సాగుతో మంచా లాభాలు సాధించవచ్చు. దీంతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది.
రైల్వేకోడూరు, డిసెంబరు 24: సమగ్ర యాజమాన్యంతో బొప్పాయి సాగుతో మంచా లాభాలు సాధించవచ్చు. దీంతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలో అత్యధికంగా రైల్వేకోడూరు నియోజకవర్గంలో రైతులు బొప్పాయి సాగును చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల్లో ఎక్కువగా బొప్పాయి సాగు చేస్తున్నారు. అందులోనూ రైల్వేకోడూరు ప్రాంతంలో బొప్పాయి సాగు మరింత అధికం. అయితే ఫైటాఫ్తెరా బూజు, వైరస్ తెగుళ్లు వల్ల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఆలస్యంగా నాటడంతో పూత, పిందె మగ్గి, ఎండి రాలిపోతోంది. కాయల్లో నాణ్యత తగ్గి గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. ఎక్కువగా రెడ్ లేడీ అనే రకాన్ని సాగు చేయడం వలన వైరస్ తెగుళ్లు పంట ప్రారంభ దశలో తక్కువగానే ఉన్నా, కాయ తయారయ్యే దశ కొచ్చే సరికి తెగులు ప్రతి చెట్టుకు వ్యాప్తి చెందుతోంది. వైరస్ తెగుళ్లలో ఆకుముడత, రింగ్‌స్పాట్ ముఖ్యంగా వ్యాప్తి చెందుతాయి. బొప్పాయి నారును రసం పీల్చు పురుగులు బొరబడని 40-60 సైజు కలిగిన నైలాన్‌మెష్ నెట్ హౌస్‌లో పెంచాలి. ఈ పురుగులు ఆశించే గుమ్మడి, బూడిద గుమ్మడి, వంగ చెట్లను పరిసరాల్లో పెంచకూడదు. బొప్పాయి తోట చుట్టూ మొక్కలు నాటే 15 రోజుల ముందు మొక్కజొన్న, జొన్న, అవిసె చెట్లను రెండు వరసలు రక్ష పంటగా వేసుకోవాలి. నారు మొక్కలపై పొలంలో నాటే 3 రోజుల ముందు అసిఫేట్ అనే మందును 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి చల్లాలి. పేను బంక వైరస్ పసుపు రంగు జిగురు పూసిన కార్డులను ఎకరాకు 12-15 చొప్పున పొలంలో అమర్చాలి. తెల్లదోమ నివారణకు నీలిరంగు ఎరలను అమర్చాలి. రసం పీల్చే పురుగులను గమనించిన వెంటనే వేపనూనె 2.5 మిల్లీలీటర్లు, అసిఫేట్ 1.5 గ్రాములు, శాండోవిట్ (జిగురు) 0.5 మీల్లిలీటర్లను లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. అంతేకాక చెట్టు రోగ నిరోధక శక్తి కలిగి ఉండటానికి 10 గ్రాముల యూరియా, జింక్ సల్ఫేట్ 1.5 గ్రాములు, బోరాన్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి 6 నెలల వరకు 30 రోజుల వ్యవధి లో చల్లాలి. అధికంగా ఎరువులు వేయనవసరం లేదు. డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు, జిగురు పదార్థం 0.5 మీల్లీలీటర్లు, షాంపు ప్యాకెట్ కలిపి తెగులును నివారించు కోవచ్చును. వైరస్ తెగుళ్లు ఆశించిన చెట్లను చిన్న దశలోనే గమనించి పీకి కాల్చి వేయాలి. పొలంలో సేంద్రియ పదార్థం అఽభివృద్ధికి వేప ఆకులను మగ్గ బెట్టి ఎరువుగా వేయడం, వేప గింజల కషాయాన్ని ఆకులపై చిన్న దశలో చల్లడం వలన కొంతవరకు తెగుళ్లను అరికట్టవచ్చు. బొప్పాయికి బూజు, వేరుకుళ్లు ఇవి పలు రకాల నేలలో ఉండే శిలీంధ్రాల వలన తెగుళ్లు ఆశిస్తాయి. పంట మార్పిడి పాటిస్తూ, తెగుళ్లు ఆశించినప్పుడు మైటలాక్సైల్ 2 గ్రాములు, ఫినాయెడోన్, మాంకోజబ్ (సెక్టి నే) మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే బూజు తెగుళ్లను నియం త్రించ వచ్చు. రైల్వేకోడూరు, ఓబులవారి పల్లె, చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు తదితర మండలాల్లో 20 వేల హెక్టార్ల లో రైతులు బొప్పాయి సాగు చేస్తున్నారు. కూలీలు, దున్నకాలు, మొక్కలు, ఎరువు లు, చీడపీడల మందులు ఎకరాకు కలిపి రూ. 30 వరకు ఖర్చు వస్తుంది. ఎకరాకు బాగా దిగుబడి వస్తే రూ. 1.5 లక్షలు వస్తాయని రైతులు చెబుతున్నారు.