హుండీ దొంగల ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2023-08-15T00:01:44+05:30 IST
మండల కేంద్రంలోని పలు ఆలయాల్లో చోరీలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ చంద్రమోహన్ తెలి పారు.

వీరబల్లి, ఆగస్టు 14: మండల కేంద్రంలోని పలు ఆలయాల్లో చోరీలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ చంద్రమోహన్ తెలి పారు. ఆయన వివరాల మేరకు.. ఇటీవల గంగ మ్మ ఆలయంలో, రాగిమానుదిన్నెపల్లె నరసింహస్వామి ఆలయాల్లో హుండీల దొంగతనం జరిగిందని స్థానిక గ్రామస్తులు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టి సోమవారం రాగిమానుదిన్నెపల్లె వద్ద 6 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వీరు తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం చిన్నబయలు పచ్చారవాండ్లపల్లె యానాదికాలనీకి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. వీరంతా ఇటీవల వీరబల్లి, సంబేపల్లె, చిన్నమండెం, రామాపురం, మన్నూరు, ఓబులవారిపల్లె మండలాల్లో హుండీ చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ వైర్లు, స్టార్టర్లు కూడా దొంగతనం చేశారని విచారణలో తేలిందన్నారు. వారి వద్ద నుంచి రూ.35 వేలు నగదు, ఆరు గ్రామాల బంగారు, 65 గ్రాములు వెండి, 17 కిలోల రాగి వైరు, ఒక స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.