టీడీపీ అధికారంలోకి రాగానే మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా!

ABN , First Publish Date - 2023-10-04T22:48:22+05:30 IST

టీడీపీ అధికారంలోకి వస్తూనే మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఖాయమని టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు పి.సురేం ద్ర యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి పర్వీనతాజ్‌ పేర్కొన్నారు.

టీడీపీ అధికారంలోకి రాగానే మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా!
కోర్టు బయట మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

మదనపల్లె టౌన, అక్టోబరు 4: టీడీపీ అధికారంలోకి వస్తూనే మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఖాయమని టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు పి.సురేం ద్ర యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి పర్వీనతాజ్‌ పేర్కొన్నారు. మదన పల్లె జిల్లా సాధన సమితి, అమరా వతి రైతులకు మద్దతుగా రెండేళ్ల క్రితం బి.కొత్తకోటలో నిర్వహించిన ఆందోళలపై పోలీసులు టీడీపీ, సీపీఐ, బాస్‌ నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి కోర్టు వాయిదా కోసం మదనపల్లె కోర్టుకు వచ్చిన వారు మాట్లాడారు. అన్ని వనరులు వున్న మదనపల్లెను కాదని వైసీపీ ప్రభుత్వం రాయచోటిని జిల్లా కేంద్రం చేసిందని, దీనిపై శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమపై పోలీసులు కేసులు బనాయించారన్నారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. యువగళంలో నారా లోకేశ స్పష్టమైన హామీ ఇచ్చారని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తారన్నారు. ఈ కేసు వాయిదాకు టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ, గుత్తికొండ త్యాగరాజు, బాస్‌ అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్‌, సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళి పాల్గొన్నారు.

Updated Date - 2023-10-04T22:48:22+05:30 IST