Somu veerraju: రైతులను ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసింది

ABN , First Publish Date - 2023-05-06T12:46:58+05:30 IST

రైతులను ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు.

Somu veerraju: రైతులను ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసింది

తూర్పుగోదావరి: రైతులను ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (BJP State President Somuveerraju) విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. విపత్తు వస్తుందని తెలిసి ముందస్తుగా అప్రమత్తం చేయలేకపోయిందన్నారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న అవినీతిపై చార్జిషీట్ రూపొందిస్తామని.. దాన్ని జిల్లా ఎస్పీకే అందజేయనున్నట్లు చెప్పారు. నాలుగు రకాలుగా ఆందోళనలు చేయనున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jaganmohan Reddy) ఏ సహాయం చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నామని చెప్పారు. రైతులకు ఈ ప్రభుత్వం (AP Government) సంచులు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని.. ఇందులో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. సివిల్ సప్లై అధికారిని ఎందుకు ఎన్నో సంవత్సారాలుగా జిల్లాలో ఇలాగే ఉంచారని ప్రశ్నించారు. రైతు సమస్యలపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని సోమువీర్రాజు తెలిపారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-05-06T16:15:12+05:30 IST