సంజీవరాయ స్వామి సేవలో జిల్లా జడ్జి

ABN , First Publish Date - 2023-05-26T23:38:53+05:30 IST

మండలంలోని వెల్లాల క్షేత్రంలో సంజీవరాయ స్వామిని జిల్లా జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి శుక్రవారం దర్శించుకున్నారు.

సంజీవరాయ స్వామి సేవలో జిల్లా జడ్జి
జిల్లా జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న ఈవో, వేద పండితులు

చాగలమర్రి, మే 26: మండలంలోని వెల్లాల క్షేత్రంలో సంజీవరాయ స్వామిని జిల్లా జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చకులు శఠగోపంతో ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. జడ్జి దంపతులకు ఆలయ ఈవో సంజీవరాయస్వామి జ్ఞాపికను అందజేశారు. ఆలయ చైర్‌పర్సన్‌ కానాల విజయలక్ష్మి, ఎస్‌ఐ రాజగోపాల్‌, కమిటీ సభ్యుడు బలరామిరెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T23:38:53+05:30 IST