ఆలూరులో తాగునీటి కష్టాలు
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:37 AM
పట్టణ శివార్లలలోని ఎన్జీవో కాలనీలో 20 రోజులుగా తాగు నీరు అందడం లేదు. దీంతో మహిళలకు ఖాళీ బిందెలతో బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు.

20 రోజులుగా తాగునీరు లేదంటున్న ఎన్జీవో కాలనీవాసులు
పడిగాపులు తప్పడం లేదని ఆవేదన
ఆలూరు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివార్లలలోని ఎన్జీవో కాలనీలో 20 రోజులుగా తాగు నీరు అందడం లేదు. దీంతో మహిళలకు ఖాళీ బిందెలతో బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. కాలనీలో మూడు లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. రెండు లైన్లకు మాత్రం నీరు సరఫరా అవు తోంది. మూడో లైన్ పరిధిలోని 40 కుటుం బాలకు అందడం లేదు. పంచాయతీ సిబ్బందికి విన్నవించినా పట్టించు కోవడం లేదని మహి ళలు ఆరోపిస్తున్నారు.
ప్రణాళిక లేకపోవడంతోనే..
పట్టణంలో 17వేల మంది నివసిస్తున్నారు. తాగునీటి సరఫరాకు శివారులో ఎస్‌ఎస్ ట్యాంక్, 9 ట్యాంకులు ఉన్నాయి. అధికారులు నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని బాపురం, అగ్రహారం, ఆలూరులోని ఎస్‌ఎస్ ట్యాంకులను ఎల్లెల్సీ నీటితో నింపుకోవాలి. అలాగే ప్రస్తుతం ఉన్న 9 ట్యాంకులు సరిపోవడం లేదు. ఆలూరు చెరువులో మరో ఎస్‌ఎస్ ట్యాంకు, అరికెరలో మరొకటి నిర్మిస్తే తాగునీటి ఇబ్బ ందులు ఉండవు. అధికారులు ఈ దిశగా ప్రణాళిక వేసి, అమలు చేస్తే సమస్య తీరే అవకాశం ఉంది.
తాగు నీరు కొంటున్నాం
మా కాలనీకి 20 రోజులుగా తాగునీరు రావడం లేదు. డబ్బులు చెల్లించి వాటర్ క్యాన్లను కొంటున్నాం. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. - రామలక్ష్మి ఎన్జీవో కాలనీ ఆలూరు
పన్నులు చెల్లిస్తున్నా తాగునీరు రావడం లేదు
పంచాయతీకి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నప్పటికీ నీరు మాత్రం సరఫరా కావడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అంతే. నీళ్లు వదిలినా, గంటకు మించి వదలడం లేదు. అధికారులు స్పందించాలి - నీలమ్మ ఆలూరు