AP Employees: మంత్రులు, ఎమ్మెల్యేలకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారు: బొప్పరాజు | Ministers and MLAs are being paid salaries on 1st Bopparaju bbr

AP Employees: మంత్రులు, ఎమ్మెల్యేలకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారు: బొప్పరాజు

ABN , First Publish Date - 2023-03-07T16:35:15+05:30 IST

మంత్రులు, ఎమ్మెల్యేల (Ministers MLAs)కు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారని, మరి ఉద్యోగులకు 1వ తేదీనే ఎందుకు జీతాలు వేయడం లేదు..

AP Employees: మంత్రులు, ఎమ్మెల్యేలకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారు: బొప్పరాజు

అమరావతి: మంత్రులు, ఎమ్మెల్యేల (Ministers MLAs)కు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారని, మరి ఉద్యోగులకు 1వ తేదీనే ఎందుకు జీతాలు వేయడం లేదు? అని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు (APJAC Amaravati President Bopparaju Venkateshwarlu) ప్రశ్నిచారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయానికే పెన్షన్ ఇస్తున్నారని, ఉద్యోగులకు సీపీఎస్ (CPS) రద్దు చేయమంటే మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఏ హామీ ఇచ్చినా లిఖితపూర్వకంగానే ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. మంత్రుల కమిటీ ఏం చెబుతుందో చూస్తామని, అప్పటివరకూ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని బొప్పరాజు ప్రకటించారు.

ఉద్యోగ సంఘాల (Ap Employees Union)కు, ప్రభుత్వాని (AP Government)కి మధ్య వార్ నడుస్తూనే ఉంది. సమస్యలను పరిష్కరించాలని, సీపీఎస్‌ (CPS)ను అమలు చేయాలంటూ చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్లు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఉద్యోగుల వేతన వెతలు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు వేతన వెతలు ప్రారంభమయ్యాయి. జీతం చేతికి ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విడతలవారీగా జమ చేస్తుండడంతో కొందరి ఖాతాల్లో పడే సరికి నెల ముగిసిపోతోంది. కొన్నిశాఖల్లో పనిచేస్తున్న వారికి రెండు నెలలు గడిచి మూడో నెల ముగింపునకు వస్తున్నా ఇంకా వేతనం అందని పరిస్థితి ఏర్పడింది. పనిచేసిన కాలానికి జీతాలివ్వండి మహాప్రభో అని వారు అడుక్కోవాల్సి వస్తోంది. అయినా ప్రభుత్వంనుంచి స్పందన లేకపోవడంతో వారంతా అప్పులపాలవుతున్నారు. వాటిని సకాలంలో చెల్లించలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.

Updated Date - 2023-03-07T16:35:15+05:30 IST