MLA Anil : ఎవరితోనైనా నాకు సెట్ కాకుంటే దూరంగా ఉంటా

ABN , First Publish Date - 2023-05-18T14:08:32+05:30 IST

రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు జగన్ తనను తిట్టినా, తన్నినా, తన వల్ల పార్టీకి నష్టమన్నా కూడా తాను సీఎం జగన్ కోసమే పనిచేస్తానని ఎమ్మెల్యే అనిల్ కుండబద్దలు కొట్టారు. ఎవరితోనైనా తనకు సెట్ కాకుంటే దూరంగా ఉంటానన్నారు. తనను రమ్మని పిలిస్తే, వెళ్లి మాట్లాడుతానన్నారు.

MLA Anil : ఎవరితోనైనా నాకు సెట్ కాకుంటే దూరంగా ఉంటా

నెల్లూరు : రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు జగన్ తనను తిట్టినా, తన్నినా, తన వల్ల పార్టీకి నష్టమన్నా కూడా తాను సీఎం జగన్ కోసమే పనిచేస్తానని ఎమ్మెల్యే అనిల్ కుండబద్దలు కొట్టారు. ఎవరితోనైనా తనకు సెట్ కాకుంటే దూరంగా ఉంటానన్నారు. తనను రమ్మని పిలిస్తే, వెళ్లి మాట్లాడుతానన్నారు. ఒకరి మీద చాడీలు చెప్పే మనస్తత్వం తనది కాదని అనిల్ వెల్లడించారు. ఏడాది నుంచి మిన్నకున్నా.. ఇప్పుడు జగన్‌ వద్ద ఒక్కొక్కరి నిజస్వరూపాలు బయటపెడతానన్నారు. అన్నని తాను ఏ విషయంలోనైనా ఒప్పించుకోగలనని దీమా వ్యక్తం చేశారు. ‘అనిల్... నువ్వు ఇక్కడ పోటీ చేయొద్దు.. ఓడిపోతావంటే గమ్మున ఉంటా. బిడ్డ మీద తండ్రి కోప్పడడా... అన్న మీద తమ్ముడు కోప్పడడా? అలా కోప్పడటం లేదంటే అది ఫేక్ అని అర్థం’ అని ఎమ్మెల్యే అనిల్ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-18T14:08:32+05:30 IST