Nellore: ఆ పార్టీ నుంచి నేను పోటీ చేయడంలేదు: కోటంరెడ్డి

ABN , First Publish Date - 2023-02-09T11:51:38+05:30 IST

నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)పై తన అసంతృప్తిని ప్రతి రోజు మీడియా ముందు వెళ్లగక్కుతున్నారు.

Nellore: ఆ పార్టీ నుంచి నేను పోటీ చేయడంలేదు: కోటంరెడ్డి

నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)పై తన అసంతృప్తిని ప్రతి రోజు మీడియా ముందు వెళ్లగక్కుతున్నారు. తాజాగా గురువారం మీడియా (Media) సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ వైసీపీ నుంచి పోటీచేయడంలేదని స్పష్టం చేశారు. తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందన్నారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్తానన్నారు.

నెల్లూరు రూరల్ అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డి (Adala Prabhakara Reddy)అని చెబుతున్నారని, ఆదాల ఏ పార్టీలో ఉంటున్నారో స్పష్టత ఇవ్వాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా అన్ని పార్టీలకు ఆదాల తిరగొద్దని సూచించారు. వేల కోట్ల ఆస్తులున్న ప్రభాకర్ రెడ్డితో ఢీ కొనడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. తాను ఎవరినీ శత్రువుగా భావించనని.. పోటీదారుగానే భావిస్తానని కోటంరెడ్డి అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ (Phone Tapping)పై హోంశాఖకు ఫిర్యాదు చేసినట్టేనన్నారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) కూడా విచారణ కోరాలని డిమాండ్ చేశారు. మేయర్ సహా 11 మంది కార్పొరేటర్లు (11 Corporators) తనవెంట ఉన్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ వైపు వెళ్లిన వారు.. రాజకీయంగానే కాదని.. మానసికంగా కూడా తనకు దగ్గరగా ఉన్నారన్నారు. ఆరు నెలల తరువాత చిత్ర విచిత్రాలు ఎన్నో చూస్తారన్నారు.

కాగా ఫోన్ ట్యాపింగ్‌ (Mobile Tapping)పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. తన ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖ (Centra Home Ministry)కు లేఖ రాశారు. అవకాశం వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖకు నేరుగా ఫిర్యాదు చేస్తానన్నారు. ట్యాపింగ్‌పై ఆరోపణలు చేస్తే తనపైనే విమర్శలకు దిగుతున్నారన్నారు. తాను ఆరోపణలు చేసినప్పుడు అధికారపార్టీ నేతలు కూడా సరైన పద్ధతిలో మాట్లాడాలన్నారు. తనపై శాపనార్దాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రహదారులు, కాల్వల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని కోటంరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-02-09T11:51:41+05:30 IST