పామూరులో ట్రాఫిక్ పాట్లు..!
ABN , First Publish Date - 2023-02-20T22:11:36+05:30 IST
ట్రాఫిక్ సమస్యతో వాహ నదారులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా పామూరు టూ నెల్లూరు మొయిన్ రోడ్ మమ్మీడాడీ సెంటర్‌లోని సీఎస్‌పురం బస్డాండ్ సెం టర్‌లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది.

ఆక్రమణకు గురవుతున్న రోడ్డు మార్జిన్‌లు
ప్రధాన రహదారిపై భారీ వాహనాల నిలిపివేత
ముందుకు కదలలేని చోదకులు
విస్తరణపై దృష్టి సారించని అధికారులు
పామూరు, ఫిబ్రవరి 20 : ట్రాఫిక్ సమస్యతో వాహ నదారులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా పామూరు టూ నెల్లూరు మొయిన్ రోడ్ మమ్మీడాడీ సెంటర్‌లోని సీఎస్‌పురం బస్డాండ్ సెం టర్‌లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. ఇక్కడ రహదారులకు ఇరువైపులా ఉన్న రోడ్ మార్జిన్‌లను సైతం దుకాణదారులు రోడ్డుకు మించి ఎత్తుగా సిమెం ట్‌తో ఎత్తు లేపడంతో ద్విచక్ర వాహనదారులు వెళ్లాల న్నా, పార్కింగ్ చేయాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో వాహనాలను రోడ్లపైనే నిలపడంతో మిగతా వాహనదారులు, పాదచారులకు తీవ్ర అసౌకర్యం కలు గుతోంది. పెద్ద ఎత్తున రోడ్ల మార్జిన్‌లను దుకాణ యజ మానులు ఆక్రమించడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవు తోందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. ఎదురెదురుగా రెండు వాహనాలు మొయిన్ రోడ్డుపైకి వచ్చినప్పుడు ట్రాఫిక్ నిలిచిపోతున్నది. ఈక్రమంలో తీవ్ర జాప్యం చోటుచేసుకొని ప్రజలు అవ స్థలు పడుతున్నారు. దుకా ణాలకు సరుకులు తీసుకొచ్చే లారీలు ప్రధాన రో డ్డుపైనే నిలిపి అన్‌లోడ్ చేస్తుం డడంతో వాహనరాక పోకలు సాగడం లేదు. పెరుగు తున్న వాహనాలు, ట్రా ఫిక్ సమస్యను దృష్టిలో పెట్టు కొని పోలీసులు, అధి కారులు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. మార్జిన్ల ఆక్రమిస్తున్న యజమానులు, రోడ్లపై విచ్చ లవిడిగా తోపుడుబండ్లు, చిన్నచిన్న బంకులను ఏర్పాటు చేసి వాటిని అద్దెలకు ఇచ్చి మరీ వ్యాపారాలు చేయి స్తున్నారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు రోడ్డు విస్తరణ చర్యలకు ఉపక్ర మించి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని, ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.