Share News

Durgamma Temple: గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ

ABN , First Publish Date - 2023-10-16T09:38:51+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. రెండవ రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. తెల్లవారుజాము నుండే అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనం ఇస్తున్నారు.

Durgamma Temple: గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. రెండవ రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. తెల్లవారుజాము నుండే అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనం ఇస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళవర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. శిరస్సు యందు బ్రహ్మ, హ్రుదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు. గాయత్రీ దేవిని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని విశ్వాసం. గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు దుర్గగుడికి తరలివస్తున్నారు.

Updated Date - 2023-10-16T09:40:45+05:30 IST