TDP vs YCP: గుడివాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ
ABN , First Publish Date - 2023-04-13T20:32:57+05:30 IST
గుడివాడలో టీడీపీ (TDP) వర్సెస్ వైసీపీ (YCP) నేతల మధ్య ఘర్షణ జరిగింది.

విజయవాడ: గుడివాడలో టీడీపీ (TDP) వర్సెస్ వైసీపీ (YCP) నేతల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీని తిడుతూ వైసీపీ కార్యకర్తలు హల్‌చల్ చేశారు. శరత్ థియేటర్ దగ్గర టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేశారు. అటుగా వెళ్తున్న మాజీ ఎంపీ మాగంటి బాబు అనుచరులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల నేతలను చెదరగొట్టారు.
ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ 175 స్థానాల్లో వైసీపీ(YCP)ని ఓడించడమే ధ్యేయమని అన్నారు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, వైసీపీ నేతలు బానిసల్లా బతుకుతున్నారని అన్నారు. తమ బలానికి తగ్గట్లే తాను పోటీకి పెట్టానని, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను గాడిదల్లా కొనలేదా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే వారు తమకు సపోర్టు చేస్తే తప్పా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
మంత్రి బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై బాధ్యత తీసుకుంటానన్న బొత్స.. రాజీనామా చేయాలి కదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అప్పుడే విలువలతో కూడిన రాజకీయం చేసినట్టు అవుతుందని తెలిపారు. ఏపీలో ఫేక్ గేమ్వార్ బాగా నడుపుతున్నారని, సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఉండవల్లి శ్రీదేవి ప్రాణహాని ఉందంటున్నారని.. ఆమెకు రక్షణ కల్పిస్తామన్నారు. గతంలో ఎంపీ రఘురామకు రక్షణ కల్పించినట్టే ఆమెకు అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ముందస్తు వచ్చినా సిద్దమేనని, తాము రెడీగా లేమని జగన్ (JAGAN) పగటి కలలు కంటున్నారని, ప్రజలు టీడీపీకి ఓటేయడానికి రెడీగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, చెత్త మీద పన్ను.. ఆస్తి పన్ను భారంగా మారాయన్నారు. ఆస్తి పన్నులో చెత్త పన్నును కలిపేశారని, ఇవాళ ఒకటో తేదీ ఎవరికైనా జీతాలు పడ్డాయా..? అని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.