Chandrababu: వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2023-06-15T18:31:52+05:30 IST

వచ్చే ఎన్నికల టీడీపీ అధికారంలో వస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధీమా వ్యక్తం చేశారు. హంద్రీనీవా పూర్తి చేసి నీళ్లిచ్చే బాధ్యత టీడీపీదేనని స్పష్టం చేశారు.

Chandrababu: వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది: చంద్రబాబు

కుప్పం: వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధీమా వ్యక్తం చేశారు. హంద్రీనీవా పూర్తి చేసి నీళ్లిచ్చే బాధ్యత టీడీపీదేనని ఆయన స్పష్టం చేశారు. పేదలను ధనికుల్ని చేసే బాధ్యత తీసుకుంటానని పునరుద్ఘాటించారు. కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని వాగ్దానం చేశారు. కుప్పానికి తొలిసారిగా ఇజ్రాయెల్‌ టెక్నాలజీ తీసుకువచ్చానని, ఇక్కడ ఆధునిక పద్దతుల్లో వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ‘‘అభివృద్ధికి మారుపేరు తెలుగు దేశం పార్టీ. సైకిల్ ముందు చక్రం సంక్షేమం.. వెనుక చక్రం అభివృద్ధికి గుర్తు. రెండు చక్రాలు నడిస్తేనే అభివృద్ధి పథంలో సాగుతాం. భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ సైకిల్‌తో టీడీపీ (TDP) జోరు పెంచుతాం. అభివృద్ధి, సంక్షేమానికి తోడుగా మరిన్ని కార్యక్రమాలు చేపడుతాం’’ అని చంద్రబాబు అన్నారు.

ఏపీని దోచేస్తున్నారు

ఏపీని దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. 2019 నుంచే విధ్వంసం మొదలైందని దుయ్యబట్టారు. వైసీపీ (YCP) పాలనలో పరిపాలన పడకేసిందని, పది రూపాయలు ఇచ్చి రూ.100 దోచేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్‌, ఆర్టీసీ, గ్యాస్‌ ధరలు భారీగా పెంచారని తెలిపారు. వైసీపీ నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కూడా లేదని, ఇసుక, మద్యం, గనుల దోపిడీ, భూ కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నారని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం గ్రానైట్‌ను కొల్లగిడితే టీడీపీ అడ్డుకుందని చంద్రబాబు గుర్తుచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యం లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజల ఆదరణ జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పారు. మళ్లీ జన్మ ఉంటే మీ సేవకుడిగానే పుడతానని ప్రకటించారు. టీడీపీని 9 సార్లు గెలిపించిన ఘనత కుప్పానికే దక్కిందన్నారు. గతంలో ఇంటింటికీ 2 ఆవులు ఇస్తానన్న హామీ నెరవేర్చానని, ఇంటింటా పాల ఉత్పత్తి పెరిగి ఆదాయం సమకూరిందని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2023-06-15T19:12:13+05:30 IST