Devineni Uma: కమీషన్ల కక్కుర్తితో జగన్ రివర్స్ టెండరింగ్ డ్రామాలాడారు
ABN , First Publish Date - 2023-06-06T21:47:11+05:30 IST
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీడీపీ (TDP) సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీడీపీ (TDP) సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) విమర్శలు గుప్పించారు. కమీషన్ల కక్కుర్తితో జగన్ రివర్స్ టెండరింగ్ డ్రామాలాడారని దేవినేని ఉమ ఆరోపించారు. పోలవరాన్ని బ్యారేజీగా మార్చి సిగ్గులేకుండా హోటళ్లు కడతారట అని విమర్శించారు.
తన అసమర్థత బయటపడుతుందనే పోలవరం దగ్గరకు మీడియాను అనుమతించడం లేదని, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం చేతకాక పోలవరం ఎత్తును 150 మీటర్ల నుంచి 135 మీటర్లకు పరిమితం చేశారని దేవినేని ఉమ మండిపడ్డారు. 31 మంది ఎంపీలు ఉన్నా డిమాండ్లు సాధించలేని అసమర్థ సీఎం జగన్ అని, బాబాయ్ హత్య కేసు నుంచి బయటపడేందుకే పరిమితమయ్యారని దేవినేని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఎలా వస్తాయో.. నిర్వాసితులను ఎలా కాపాడుతారో జగన్ చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.