ఇంటర్నేషనల్‌ కరాటే చాంపియన్‌ భారత్‌

ABN , First Publish Date - 2023-02-13T00:50:22+05:30 IST

నిజి షాటోకాన్‌ స్పోర్ట్సు కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన తొలి ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ కరాటే టోర్నీలో ఆతిథ్య భారత్‌ ఓవరాల్‌ చాంపియన్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఇంటర్నేషనల్‌ కరాటే చాంపియన్‌ భారత్‌
ట్రోఫీని అందుకున్న భారత్‌ క్రీడాకారులతో సుమన్‌, దాడి వీరభద్రరావు

ద్వితీయ, తృతీయ స్థానాలలో మలేషియా, శ్రీలంక

విశాఖపట్నం(స్పోర్ట్సు), ఫిబ్రవరి 12: నిజి షాటోకాన్‌ స్పోర్ట్సు కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన తొలి ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ కరాటే టోర్నీలో ఆతిథ్య భారత్‌ ఓవరాల్‌ చాంపియన్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. మలేషియా, శ్రీలంక జట్లు ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయి. స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమానికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, సినీ నటుడు సుమన్‌ తల్వార్‌ ముఖ్య అతిఽథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కరాటే క్రీడాంశానికి విశేష ఆదరణ లభించడం హర్షణీయమన్నారు. అంతేకాకుండా కరాటే క్రీడకు విశాఖ ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందడం ఆహ్వానించదగ్గ విషయమని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా కరాటే పోటీలను నిర్వహిస్తూ వర్ధమాన ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహక కార్యదర్శి, నిజి షాటోకాన్‌ స్పోర్ట్సు కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి ఎస్‌పీఎండీ నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-13T00:50:24+05:30 IST