మహాత్మ జ్యోతిరావు ఫూలేకు ఘన నివాళి
ABN , First Publish Date - 2023-04-12T01:28:40+05:30 IST
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని గ్రీన్‌పార్క్ హోటల్ జంక్షన్‌లో గల ఆయన విగ్రహానికి పలువురు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని గ్రీన్‌పార్క్ హోటల్ జంక్షన్‌లో గల ఆయన విగ్రహానికి పలువురు పూల మాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేవీ సత్యనారాయణ మూర్తి, తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గండి బాబ్జీ, ఉన్నారు. సమాజానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి అని ఈ సందర్భంగా కొనియాడారు.