రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే

ABN , First Publish Date - 2023-02-10T00:01:54+05:30 IST

రానున్న ఎన్నిక ల్లో తెలుగుదేశం పార్టీ విజ యం సాధిస్తుందని గజ పతినగరం మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అన్నారు. గురువారం మండలంలోని లోట్లపల్లి గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్య క్రమం నిర్వహించారు.

రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే
జామి: లోట్లపల్లిలో నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు

జామి: రానున్న ఎన్నిక ల్లో తెలుగుదేశం పార్టీ విజ యం సాధిస్తుందని గజ పతినగరం మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అన్నారు. గురువారం మండలంలోని లోట్లపల్లి గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఈ ముఖ్య మంత్రి ప్రజలకు పప్పు బెల్లాలు పంచి పెద్దఎత్తున వారిని దోపీడీ చేస్తున్నారని, ప్రశ్నిం చేవారి గొంతును నోక్కేస్తున్నారని మండిపడ్డారు. ఈ పాలన కు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు స్వామినాయుడు, మాకిరెడ్డి శ్రీలక్ష్మి, దనియాల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

- రాజాం: మున్సిపాలటీ పరిధి మాదిగ వీధి మెంతిపేట ఎస్సీ కాలనీలో గురువారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వైసీపీ ప్రభు త్వం చేపడుతున్న పఽథకాలపై మహిళలను అడిగి తెలుసు కున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అరచకాలను ప్రజలకు వివరించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శాసపు రమేష్‌కుమార్‌, పొట్టా చిట్టిబాబు, టంకాల కన్నంనాయుడు, పెంకి గౌరీశ్వరరావు, మరిపి జగన్మోహన్‌, పిల్లా సత్యంనాయుడు, ముగడ శ్రీను, శిమ్మ సగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

‘అప్పుల ఊబిలోకి రాష్ట్రం’

రాజాం: ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని మాజీ స్పీకర్‌, టీడీపీ నాయకురాలు కావలి ప్రతిభా భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం రాజాం మండలం నందబలగ, వంగర మండలం మడ్డువలస గ్రామాల్లో పర్యటించి శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాగేళ్లు కావస్తున్నా ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఎన్నికల మందు ఇచ్చిన హమీలు ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. ఒక్క అవకావం ఇమ్మని అధికారం చేపట్టిన జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోని నెట్టారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అరచాకాలను ప్రజలకు వివరించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని చెప్పారు. పార్టీ నాయకులు పైల వెంకటరమణ, శాసపు కేశవనాయుడు, మానం గోవిందరావు, తెంటు కృష్ణ, గేదెల అప్పలనాయుడు, శ్రీధర్‌నాయుడు, తాడి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు

‘ఇది రైతు దగా ప్రభుత్వం’

వంగర: రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయలేని దగాకోరు ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరప డ్డాయని విజయనగరం పార్లమెంటరీ వ్యవహారాల టీడీపీ ఇన్‌చార్జి కిమిడి రాంమల్లిక్‌ నాయుడు అన్నారు. గురువారం మడ్డువలసలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేఖరు లతో మాట్లాడారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగో లు చేస్తుందనుకుంటే నామ మాత్రంగా చేపట్టి చేతులు దు లుపుకుందన్నారు. ప్రభుత్వం కొనుగోలు లేక దళా రులకు అమ్ముకోలేక రైతులు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నార న్నారు. టీడీపీ నాయకులు త్రినాథ, మురళీకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-10T00:01:55+05:30 IST