బొబ్బిలి ఏఎంసీ చైర్మన్‌గా నర్సుపల్లి
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:08 AM
బొబ్బిలి వ్య వసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తెర్లాం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటనా యుడు నియమితులయ్యారు.

బొబ్బిలి/తెర్లాం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి వ్య వసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తెర్లాం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటనా యుడు నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఏఎంసీలకు చైర్మన్లను నామినేట్ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసిం ది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలంది స్తున్న వెంకటనాయుడుకు కూటమి ప్రభుత్వంలో సముచితస్థానం దక్కింది. 1985 నుంచి నేటి వరకు మధ్యలో ఓ రెండేళ్లు మినహా మొత్తం కాల మంతా ఆయన తెర్లాం మండల టీడీపీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 1995లో తెర్లాం సర్పంచ్‌గా, 1986లో తెర్లాం కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా, బాడంగి, తెర్లాం, మెరకము డిదాం మండలాల నీటితీరువా అధ్యక్షుడిగా పనిచేశారు. దివంగత ఎమ్మెల్యే తెంటు జయప్రకాశ్‌కు ముఖ్య అనుచరునిగా కొనసాగిన ఆయన ఇప్పుడు బొబ్బిలి రాజులకు, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయు డుకు విశ్వసనీయ అనుచరునిగా ఉన్నారు. టీడీపీ అభిప్రా యసేకరణ ద్వారా నర్సుపల్లికి బొబ్బిలి ఏఎంసీ పదవిని కట్టబెట్టింది. వెంకటనాయుడు నియామకంపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు సేవ చేస్తా: నర్సుపల్లి
బొబ్బిలి ఏఎంసీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమిం చడం ఆనందంగా ఉంది. రైతులకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినట్లుగా భావిస్తున్నాను. ఎమ్మెల్యే బేబీనాయన, మాజీమంత్రి సుజయ్‌కృష్ణరంగరావు, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడుకు కృతజ్ఞతలు. మా నాయకుల సూచనలు, సలహాలతో వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. నియోజకవర్గ పరిధిలోని రైతులంద రికీ మరింత ప్రయోజనకరంగా ఏఎంసీని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది.