అన్నదాతను ఇబ్బంది పెడితే సహించను : మంతెన
ABN , First Publish Date - 2023-05-25T00:33:52+05:30 IST
ఆరుగాలం చమటోడ్చి పంటలను పండిస్తున్న అన్నదాతలను ఎవరైనా ఇబ్బంది పెడితే సహించేది లేదని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు హెచ్చ రించారు.

ఉండి, మే 24 : ఆరుగాలం చమటోడ్చి పంటలను పండిస్తున్న అన్నదాతలను ఎవరైనా ఇబ్బంది పెడితే సహించేది లేదని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు హెచ్చ రించారు. ఉప్పులూరులో బుధవారం రైతుల ధాన్యంను కొనుగోలు చేయక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతుల వద్ద ఉన్న ధాన్యంను అధికారులు, మిల్లర్లు పూర్తిగా కొనుగోలు చేసి వుండాల్సి ఉందనీ, ఆవిధంగా చేయకుండా నిర్లిప్తంగా వుంటే తాను ఉన్నతాధికారుల దృష్ఠికి తీసుకుని వెళ్తానన్నా రు. గ్రామంలో ఇంకా ఎంత ధాన్యం రైతుల వద్ద వుందో పరిశీలించారు. ఏవో సంధ్య ధాన్యం లెక్కలను ఎమ్మెల్యేకు వివరించారు. దానిపై ఆయన జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే ధాన్యం కోనుగోలు చేయాలని సూచించారు. సుబ్రహ్మణ్యం, చిట్టిబాబు, లోకం సుబ్బారావు, ఓదూరి రాంబాబు పాల్గొన్నారు.