పందేలు నిర్వహిస్తే ఊరుకోం
ABN , First Publish Date - 2023-01-10T00:03:36+05:30 IST
వివిధ ప్రాంతాల్లో కోడి పందాల బరులను సోమవారం పోలీసులు ధ్వంసం చేశారు. కోడిపందేలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు.

బరులు ధ్వంసం చేసిన పోలీసులు
పాలకొల్లు రూరల్ /యలమంచిలి/ ఉంగుటూరు/వీరవాసరం, జనవరి 9 : వివిధ ప్రాంతాల్లో కోడి పందాల బరులను సోమవారం పోలీసులు ధ్వంసం చేశారు. కోడిపందేలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. పాలకొల్లు మండలంలోని వాలమర్రు, శివదేవుని చిక్కాల, వడ్లవానిపాలెం, చింతపర్రు, దగ్గులూరు, కాపవరం గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్న బరులను పాలకొల్లు రూరల్ ఎస్‌ఐ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు.ఎస్‌ఐ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువత కోడి పందాలు, పేకాట, గుండాట వంటి జూదాలకు దూరంగా ఉండాలని సంప్రదాయ క్రీడల వైపు మొగ్గు చూపిం చాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి సందర్భంగా ఏవిధమైన కోడి పందాలకు, పేకాట, గుండాట వంటి జూదాలకు అనుమతులు లేవని కాబట్టి బరులకు స్థలాలను యజమానులు ఇవ్వరాదని ఇస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యలమంచిలి మండలంలోని యలమంచిలి, మేడపాడు, కట్టుపాలెం, ఏనుగువానిలంక గ్రామాల్లో బరులను సోమవారం ఎస్‌ఐ జె.వి.ఎన్.ప్రసాద్ పోలీసు సిబ్బంది ట్రాక్టర్‌తో దుక్కి దున్నించారు. ఆయా గ్రామాల్లో నిర్వహిం చిన అవగాహన సదస్సుల్లో ఎస్‌ఐ మాట్లాడుతూ కుటుంబసభ్యులు, మిత్రు లతో సంక్రాంతి పండుగను సంప్రదాయబద్దంగా నిర్వహించుకోవాలన్నారు.
జాదక్రీడలను నిర్వహించకుండా చేబ్రోలు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రెండురోజుల నుంచి కోడిపందాలు నిర్వహించే బరు లను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. కోడి కత్తులు కట్టే వారిని ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకుంటున్నారు. సోమవారం చేబ్రోలు ఎస్‌ఐ కే.స్వామి, తహసీల్దార్ ఏ.వి.రమణల ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలో అవ గాహన ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించారు. బాదంపూడి శివారులో రహదారికి సమీపంలో ఏర్పాటు చేయనున్న బరులను ధ్వంసం చేశారు.
వీరవాసరం మండలంలో కోడి పందాలు నిర్వహించే ప్రాంతాలను గుర్తిం సీఐ సీహెచ్ నాగప్రసాద్, ఎస్‌ఐ రమేష్ సిబ్బంది పర్యటించారు. కొణితివాడ, నవుడూరు గ్రామాలలో కోడిపందాల నిర్వహిస్తారనే ప్రదేశాలలో ఉన్న బరులను ట్రాక్టర్లతో దుక్కి చేయించారు. భీమవరం రూరల్ సర్కిల్ పరిధిలో కోడిపందాలకు సంబంధించి 270 బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. వీరవాసరం మండలంలోని తోలేరులో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 264 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరవారంం మండలంలో 75 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని, మూడు బరులను ధ్వంసం చేసినట్టు చెప్పారు.