మాధవాయిపాలెం రేవు రూ.4.18 కోట్లు
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:17 AM
మాధవాయిపాలెం రేవు పాటలో శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది.

వేలంలో రికార్డు ధర
నరసాపురం రూరల్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మాధవాయిపాలెం రేవు పాటలో శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహిం చిన బహిరంగ, రహస్య వేలంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా టేకిశెట్టిపాలెం గ్రా మానికి చెందిన విఘ్నేశ్వర క్వారీ, బోట్స్‌మెన్ లేబర్, కాంట్రాక్టు కోపరేటివ్ సొసైటీ రూ 4,18,19,959 ధరకు రేవును దక్కించుకుంది. వందేళ్ల చరిత్రలో ఇదే హెచ్చు మొత్తం. 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిర్వహించిన వేలంలో రూ.33 లక్షలు చెల్లించి ఎనిమిది మంది పాల్గొన్నారు. ముందుగా బహిరంగ వేలం నిర్వ హించారు. విఘ్నేశ్వర సొసైటీ రూ 3.64కోట్లు, రాజ్లులంక సొసైటీ రూ 3.40 కోట్లకు వెళ్లాయి. వేలం ఖరారు చేయకుండా రహస్య టెండర్లు తెరిచారు. అందులో కూడా కోనసీమ జిల్లాకు చెందిన విఘ్నేశ్వర సొసైటీ అత్యధిక మొత్తం కోట్ చేసింది. రెండో స్థానంలో ది నరసాపురం శాండ్ అండ్ కోపరేటివ్ సొసైటీ రూ 3.95కోట్లకు కోట్ చేసింది. విఘ్నే శ్వర సొసైటీ రూ 25లక్షల హెచ్చు మొత్తంతో రేవు నిర్వహణ బాధ్యత దక్కించుకున్నట్లైంది. జిల్లా అధికారు లు వేలం అధికారికంగా అమోదిం చాల్సి ఉంది. అనంతరం ఏప్రిల్ 1 నుంచి రేవు నిర్వహన బాధ్యతలను మండల పరిషత్ పాట దారుకు అప్పగించనుంది. మరోవైపు ఊహించని దాని కంటే అత్యధిక మొత్తం ఆదాయం రావ డంతో అధికారవర్గాల్లో అనందోత్సహాలు వ్యక్తమవుతు న్నాయి. గత ఏడాది ఏడు నెలలకే వేలం నిర్వ హించగా రూ.2.96కోట్లు ఆదాయం వచ్చింది. ఎంపీపీలు సోని, మల్లికార్జునరావు, జడ్పీ అధికా రులు భవాని, హరికృష్ణ, ఎంపీడీవో రామకృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు.