భారీ వృక్షం నరికేశారు
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:13 AM
మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని పరిరక్షిం చండి అని అధికారులు అవగాహన కార్యక్ర మాలు చేపడుతున్నారు.

జడ్పీ కార్యాలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం నరికివేత
అడ్డుకున్న హిందూ సంఘాల జేఏసీ
అనుమతి లేదన్న సీఈవో
ఏలూరు సిటీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని పరిరక్షిం చండి అని అధికారులు అవగాహన కార్యక్ర మాలు చేపడుతున్నారు. మరోవైపు అధికారులకు తెలియకుండానే పెద్ద పెద్ద వృక్షాలు నరికేస్తు న్నారు. జడ్పీ కార్యాలయ ఆవరణలో భారీ మర్రి వృక్షాన్ని కూల్చివేయడానికి రంగం సిద్ధం చేశా రు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఈ భారీ వృక్షాన్ని తొలగింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆదివారం కొందరు యంత్రాలతో భారీ వృక్షాన్ని నరికివేత మొదలుపెట్టారు. విషయం తెలుసుకు న్న హిందూ సంఘాల జేఏసీ నాయకులు అక్క డికి చేరుకుని నరికివేత అడ్డుకున్నారు. అప్పటికే సగం చెట్టును నరికివేయడంతో హిందూ సం ఘాల నాయకులు జడ్పీ కార్యాలయం వద్ద ఆం దోళన నిర్వహించారు. పోలీసులకు సమాచారం అందించారు. జడ్పీ సీఈవో కె.భీమేశ్వర్ మాట్లా డుతూ చెట్టు నరికేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని, పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
కేసు నమోదు
ఏలూరు క్రైం: జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో మర్రిచెట్టును కొంతమంది అపహ రించుకుపోయారని త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. భారీ మర్రిచెట్టును ఆదివారం ఉదయం పెద వేగి మండలం కూచింపూడి గ్రామానికి చెందిన బుద్ధవరపు రాజు మరి కొంత మంది నరికి ట్రాక్టర్లపై పట్టుకువెళ్లిపోయారని జడ్పీ రెవెన్యూ అధికారి ఇరణ్యకుల హరికృష్ణ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.