వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:58 AM
వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్క రించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయ కులు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు డిమాండ్ చేశారు.

ఏలూరురూరల్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్క రించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయ కులు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు డిమాండ్ చేశారు. గురువారం ఉదయం ఏలూ రు ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి అనం తరం కలెక్టర్ వెట్రిసెల్విని కలిసి వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హులైన గ్రేడ్–1 వీఆర్వోలకు సీనియర్ అసిస్టెం ట్ పదోన్న తులు ఇవ్వాలని, గ్రేడ్–2 వీఆర్వోలకు గ్రేడ్–1 వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రేషనలైజేషన్ పేరుతో క్లస్టర్ విధానంలో పరిణామాలపై కలెక్టర్‌కు వివరించారు. క్లస్టర్ విధానం పేరుతో రెవెన్యూ విలేజ్‌లకు సంబంధం లేకుండా రెండు సచివాలయాలకు కలిపి ఒక్క క్లస్టర్‌గా ఏర్పాటు చేయడం వల్ల పనిభారం పెరిగి రెవెన్యూ సేవలు ఆలస్యమవుతాయన్నారు. త్వరలో జరిగే కలెక్టర్ సదస్సులో క్లస్టర్ విధానంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిరియాల లక్ష్మీనా రాయణ, ఏలూరు జిల్లా అధ్యక్షుడు రాంబాబు, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, ఏలూరు డివిజన్ అధ్యక్షులు సాయల వెంకటేశ్వరరావు తదిత రులు పాల్గొన్నారు.