Share News

జిల్లా కేంద్ర ఆస్పత్రికి సుస్తీ

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:21 AM

తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి నిత్యం రోగుల రద్దీతో కిటకిటలాడుతుంది. ప్రధానంగా ప్రసవాల కోసం దూరప్రాంతాల నుంచి గర్భిణులు తణుకు ఆస్పత్రికి వస్తారు.

జిల్లా కేంద్ర ఆస్పత్రికి సుస్తీ
రిజిస్ట్రేషన్‌కు క్యూ

తణుకు ఆస్పత్రిలో రోగుల రద్దీ

వేధిస్తున్న వైద్యుల కొరత

వైద్య పరీక్షలకు పరికరాలు లేవు

ప్రధాన విభాగాల్లో అందని సేవలు

పారిశుధ్యం అంతంత మాత్రం

తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి నిత్యం రోగుల రద్దీతో కిటకిటలాడుతుంది. ప్రధానంగా ప్రసవాల కోసం దూరప్రాంతాల నుంచి గర్భిణులు తణుకు ఆస్పత్రికి వస్తారు. జాతీయ రహదారి, ప్రధాన రహదారులపై ప్రమాదాల్లో క్షతగాత్రులను ఇక్కడికి తరలిస్తారు. అరకొర సౌకర్యాలతో రోగులకు పూర్తిస్థాయి సేవలు అందించలేకపోతున్నారు. రక్త పరీక్షలు, ఎక్స్‌రే తప్ప ఇతర పరీక్షలకు పరికరాలు లేవు. వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

తణుకు, మార్చి20(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి నెల అవుట్‌ పేషెంట్‌ సేవలకు సుమారు 20 వేల మంది వస్తారు. నిత్యం 700 మంది అవుట్‌ పేషెంట్లతో ఆస్పత్రి కిటకిటలాడుతుంది. నిత్యం 80 మంది ఇన్‌ పే షెంట్లు ఉంటారు. నెలకు సుమారు 250 ప్రస వాలు జరుగుతాయి. 12 పీహెచ్‌సీలు, తాడేపల్లి గూడెం, పాలకొల్లు, భీమవరం, నరసాపురం ఏరియా ఆసుపత్రులతో పాటు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల, రావులపాలెం నుంచి రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఆస్పత్రి ప్రాంగణంలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పది పడకల డయాల సిస్‌ సెంటరు నిర్వహిస్తున్నారు. అదనంగా మరో 5పడకలు ఏర్పాటు చేయనున్నారు. అవుట్‌, ఇన్‌ పేషెంట్లకు చాలా వరకు మందులు ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేయని మందుల కోసం ఆసుపత్రి కమిటి నిధుల నుంచి నెలకు రూ.50 వేలు ఖర్చు చేస్తున్నారు.

వైద్యుల పోస్టులు ఖాళీ..!

కీలక విభాగాల్లో వైద్యులు అందుబాటులో లేరు. ప్రధానంగా ఆర్‌ఎంవో పోస్టు కొన్నేళ్ల నుంచి ఖాళీగా ఉంది. వివిధ విభాగాల్లో 34 మంది వైద్యులు ఉండాలి. 22 మంది వైద్యులు మాత్రమే పని చేస్తున్నారు. 12మంది వైద్యులు లేకపోవడంతో సంబంధిత విభాగాల్లో సేవలం దించడం లేదు. సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఒ–1, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ జనరల్‌–1, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ రేడియాలజిస్టు–1 (పదోన్నతిపై భర్తీ చే యాలి), డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పాఽథాలజీ–1, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ జనరల్‌–2, సివిల్‌ అసిస్టెం ట్‌ సర్జన్‌ జనరల్‌ మెడిసిన్‌–1, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ గైనకాలజీ–1, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పిడి యాట్రిక్‌–1, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పలమనాల జిస్టు–1, సివిల్‌ అసిస్టెంట్‌ జనరల్‌ 2 ఖాళీగా ఉన్నాయి. డార్కు రూమ్‌ అసిస్టెంట్‌లు 2 ఖాళీగా ఉంటే ఒకటి అనధికార సెలవులో ఉండడంతో మొత్తం గా మూడు ఖాళీగా ఉన్నాయి. ఆడియో మెట్రిషన్‌–1, జూనియర్‌ అసిస్టెంట్‌–1, సీనియర్‌ అసిస్టెంట్‌–2 ఖాళీగా ఉన్నాయి.

పారిశుధ్య కార్మికుల కొరత

ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణకు అవసర మైన సిబ్బంది లేరు. ఏరియా ఆసుపత్రిగా వంద పడకలతో సేవలందించినప్పుడు 19 మంది పారి శుధ్య సిబ్బంది ఉన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిగా 150 పడకల స్థాయి పెరిగినా పారిశుధ్య కార్మికు లను పెంచలేదు. కార్మికులు పనిభారంతో ఇబ్బం దులు పడుతున్నారు. అదనంగా 50 మందిని నియామించాల్సి ఉంది.

బ్లడ్‌ బ్యాంక్‌ లేదు

ప్రసవాలు, ప్రమాదాల కేసుల్లో రక్తం అవ సరమైన వారు బయట బ్లడ్‌ బ్యాంకులను ఆశ్రయించాల్సిందే. ఆస్పత్రిలో బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు ప్రతిపాదలు చేసినా స్టోరేజీ యూనిట్‌కు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అనుమతి ఇవ్వలేదు. రక్తం ప్రాసెస్‌ చేసే సమయంలో వ్యర్థాల నిర్వహణకు సేవేజ్‌ ట్రీట్‌మెంటు అందుబాటులో లేదు.

ప్రధాన వైద్య పరీక్షలు లేవు

ఆసుపత్రిలో థైరాయిడ్‌ పరీక్షలకు సంబం ధించిన పరికరాలు అందుబాటులో లేవు. సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌ సౌకర్యం లేదు. పరీక్షలు అవసరమైన రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిందే. ఆస్పత్రిలో ఎక్స్‌రే, రక్త పరీక్షలు మాత్రమే అందు బాటులో ఉన్నాయి.

ఆర్థోపెడిక్‌ సేవలు లేనట్లే..!

ప్రమాదాల్లో ఎముకలు విరిగిన బాధితు లను ఇతర ఆస్పత్రులకు రిఫర్‌ చేయాల్సిందే. ఆర్థోపెడిక్‌ విభాగంలో ఇద్దరు వైద్యులు ఉన్నా రు. వారిలో ఒకరు అనధికార సెలవు, మరొక వైద్యురాలు ప్రసూతి సెలవులో ఉన్నారు. ఆస్పత్రిలో ఇద్దరు మత్తు వైద్యులు అవసరం కాగా అన్ని విభాగాల ఆపరేషన్లకు ఒక్కరే సేవలందిస్తున్నారు. ఆపరేషన్‌ నిర్వహణకు అవకాశం ఉన్నా మత్తు వైద్యుడు లేక సేవలందించలేని పరిస్థితి నెలకొంది.

నెలాఖరుకు వైద్యుల పోస్టులు భర్తీ

ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు భర్తీ కాలేదు. ఇటీవల ఏఆర్‌టీ సెంటర్‌లో వైద్యుడిని నియమించారు. మరికొన్ని వైద్యుల పోస్టులు ప్రమోషన్‌పై నెలాఖరుకు భర్తీ కావచ్చు. అందుబాటులో ఉన్న వనరులు, వైద్య విభాగాల్లో రోగులకు మెరుగైన సేవలందిస్తున్నాం.

వెలగల అరుణ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌

Updated Date - Mar 22 , 2025 | 12:22 AM