YCP Minister: వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుట్ర
ABN , First Publish Date - 2023-07-23T17:51:28+05:30 IST
పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (YCP Minister Ambati Rambabu) మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు.

"చంద్రబాబు, పవన్ కలసి ప్రయాణం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లకు స్వరాష్ట్రంలో సొంత ఇల్లు లేదు. వాలంటీర్ వ్యవస్థపై బురదజల్లుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం పాఠశాలకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశాం. ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ హైదరాబాద్ వెళ్లిపోతారు. కన్నా లక్ష్మీనారాయణ బిచ్చగాడిగా తయారయ్యారు. సత్తెనపల్లిలో గంజాయి అమ్మకాలు లేవు, సహించాను. సత్తెనపల్లి డీఎస్పీ (DSP) ఆదినారాయణ నిజాయితీ గల అధికారి. నా మీద బురదజల్లె ప్రయత్నం చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ. ప్రభుత్వ డబ్బుతో చంద్రబాబు ప్రధాని మోదీని విమర్శించినప్పడు కన్నా లక్ష్మీనారాయణ ఏం చేశారు." అని అంబటి ప్రశ్నించారు.