కరి‘వేదన’
ABN , First Publish Date - 2023-07-09T23:33:57+05:30 IST
నారు పోయడం, దమ్ము చేయడం, వేయడం ...ఈ ప్రయాస అన్నదాతలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. అదును సమయంలో కూలీలు దొరక పోవటం అన్నదాతలకు తలనొప్పిగా పరిణమిస్తోంది.

కల్లూరు, జూలై 9: నారు పోయడం, దమ్ము చేయడం, వేయడం ...ఈ ప్రయాస అన్నదాతలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. అదును సమయంలో కూలీలు దొరక పోవటం అన్నదాతలకు తలనొప్పిగా పరిణమిస్తోంది. ఇలాంటి క్రమంలో సాంప్ర దాయ విధానానికి స్వస్తి పలికి రైతులు కరివేద విధానం వైపు మొగ్గు చూపుతున్నా రు. గత ఏడాది ఈవిధానంలో వరి సాగు చేసిన రైతులు గణనీయమైన దిగుబ డులు సాధించారు. ఈ ఏడాది కూడా అదే విఽధానం వైపు మొగ్గు చూపారు. ఈ పద్ధతిలో కల్లూరు మండలంలో రైతులు రికార్డు స్థాయిలో ఈ ఏడాది వరి సాగు చేశారు. ఎంతో ప్రయాస తప్పింది అనుకుంటున్న తరుణంలో అన్నదాతలను వాతావరణం దెబ్బ కొట్టింది.
కొత్త విధానమని సాగు చేస్తే.....
వాస్తవానికి కరివేద విధానంలో రైతులు దుక్కి దున్ని పొడి ధాన్యాన్ని విత్తనంగా చల్లుతారు. భూమిలో తేమవల్ల ధాన్యం మొలకెత్తుతుంది. మొలకెత్తిన ఆ వరి పైరు కు దాని వయస్సు ఆధారంగా నీటి తడులు ఇస్తారు. ఎరువుల యాజమాన్యం చేపడతారు. ఈ విధానంలో కూలీల అవసరం దాదాపుగా ఉండదు. పొడిదుక్కిలో విత్తనం చల్లడం వల్ల కలుపు సమస్య కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే ఈ విధానాన్ని వ్యవసాయ అధికారులు ప్రోత్సాహించటంతో రైతులు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఈ విధానంలో ఈ ఏడాది వానాకాలంలో పంట సాగు చేశారు. మొదట్లో కురిసిసిన అడపాదడపా వర్షాలకు రైతులు రికార్డు స్థాయి లో కరివేద విధానంలో సాగు చేపట్టారు. వర్షాలు కురుస్తాయి పంట కూడా ఏపుగా పెరుగుతోంది అనుకుంటున్న తరుణంలో వర్షాభావం అన్నదాతలకు తీవ్ర ఇబ్బం దులకు గురి చేస్తోంది.
ఎకరానికి రూ.7 వేలు...
వర్షాభావం వల్ల భూమిలో తేమ లేక పోవటంతో రైతులు చల్లిన ధాన్యం మొల కెత్తలేదు. రైతులు ఈ సంవత్సరం ఎక్కువగా సన్నాల రకాలకు చెందిన ధాన్యాన్ని కరివేద విధానంలో చల్లారు. ఒక్కో విత్తనం బస్తాకు రూ.900 చెల్లించారు. ఎకరానికి దాదాపు రూ.5 వేలు నుంచి రూ.7 వేలు దాకా పెట్టుబడులు పెట్టారు. అయితే వారి ఆశలను వరుణ దేవుడు వమ్ము చేశాడు. దీంతో ఏం చేయాలో పాలు పోక అన్నదాతలు నైరాశ్యంలో మునిగి పోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఈ ఏడాది కల్లూరు మండంలో కరివేద విధానంలో వరి రికార్డు స్థాయిలో సాగైంది. దురదృష్టవ శాత్తూ వర్షాలు కురవక పోవడంతో అన్నదాతలు పడిన శ్రమ మొత్తం వృఽథా అయ్యే పరిస్ధితి నెలకొన్నది.
వ్యవసాయశాఖ అధికారులు ఏమంటున్నారంటే.....
దీనిపై ఆంధ్రజ్యోతి వ్యవసాయశాఖ అధికారులను వివరణ కోరగా ప్రస్తుతం పొడి వాతావరణం నెలకొంది. బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొలకలు రానంత మాత్రాన అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మాములుగా వర్షం కురిసినా చాలు ధాన్యం మొలకెత్తుతుంది. రైతులు తొందరపడి కరివేద విధానంలో సాగు చేసిన మడులను మళ్లి దున్నకూ డదు. అయితే పలు గ్రామాల్లో రైతులు మొలకలు రాకపోవడంతో మళ్లీ పొలం మడులను ట్రాక్టర్ సహాయంతో దున్ని వరి ధాన్యం చల్లారు.