Groups special: ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ రైల్వే గురించి సవివరంగా..
ABN , First Publish Date - 2023-04-14T12:12:40+05:30 IST
దేశ ఆర్థికాభివృద్ధిలో భారతీయ రైల్వేలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా..
దేశ ఆర్థికాభివృద్ధిలో భారతీయ రైల్వేలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా, సరుకు రవాణా ద్వారా గణనీయ ఆదాయాన్ని సముపార్జిస్తోంది. భారత రైల్వేల నెట్‌వర్క్ 1950-51లో 53,536 కి.మీ. నుంచి ప్రస్తుతం 63,220 కి.మీ.కు విస్తరించింది.
రైల్వే రవాణా వ్యవస్థ
దక్షిణ రైల్వే(5098 కి.మీ.): 1951 ఏప్రిల్ 1న ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది.
మధ్య రైల్వే(3905 కి.మీ.): 1951 నవంబరు 5న ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయ ముంబై. ఛత్రపతి శివాజీ టర్మినల్ అని కూడా అంటారు.
పశ్చిమ రైల్వే(6182 కి.మీ.): 1951 నవంబరు 5న ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం ముంబై(చర్చిగేట్)లో ఉంది.
ఉత్తర రైల్వే(6968 కి.మీ.): 1952 ఏప్రిల్ 14న ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.
ఈశాన్య రైల్వే(3667 కి.మీ.): 1952 ఏప్రిల్ 14న ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం గోరఖ్‌పూర్.
తూర్పు రైల్వే(2414 కి.మీ.): 1952 ఏప్రిల్ 14న ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం కోల్‌కతా.
ఆగ్నేయ రైల్వే(2631): 1955 ఆగస్టు 1న ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం కోల్‌కతా.
ఈశాన్య సరిహద్దు రైల్వే(3907 కి.మీ.): 1958 జనవరి 15న ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం మాలిగావ్(గౌహతి)లో ఉంది.
దక్షిణ మధ్య రైల్వే(5803 కి.మీ.): 1966 అక్టోబరు 2న ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్‌లో ఉంది.
తూర్పు మధ్య రైల్వే(3628 కి.మీ.): 2002 అక్టోబరు 1న ప్రారంభించారు. హాజీపూర్(బిహార్‌లో) దీని ప్రధాన కార్యాలయం ఉంది.
వాయువ్య రైల్వే(5459 కి.మీ.): 2002 అక్టోబరు 1న ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం జైపూర్‌లో ఉంది.
ఉత్తర మధ్య రైల్వే(3151 కి.మీ.): 2003 ఏప్రిల్ 1న ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం అలహాబాద్‌లో ఉంది.
నైరుతి రైల్వే(3177కి.మీ.): 2003 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. కర్ణాటకలోని హుబ్లీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది.
పశ్చిమ మధ్య రైల్వే(2965 కి.మీ.): 2003 ఏప్రిల్ 1న ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ దీని ప్రధాన కార్యాలయం.
ఆగ్నేయ మధ్య రైల్వే(2447 కి.మీ.): 2003 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ఛత్తీ్‌సగఢ్‌లోని బిలా్‌సపూర్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది.
తూర్పు కోస్తా రైల్వే(కోరమాండల్ 2677 కి.మీ.): 2003 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. భువనేశ్వర్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది.
కలకత్తా మెట్రో రైల్వే(120 కి.మీ.): 2010 డిసెంబరు 31న ప్రారంభించారు. కోల్‌కతాలో దీని ప్రధాన కార్యాలయం ఉంది.
దక్షిణ కోస్తా రైల్వే: 2019 ఫిబ్రవరి ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం విశాఖ.
పూర్వ కాలంలో న్యారోగేజ్ మాత్రమే ఉపయోగించేవారు. ఆధునీకరణలో భాగంగా 98ు భారత రైల్వే లైన్లను బ్రాడ్ గేజ్‌గా మార్చారు.
కొండ ప్రాంతాల్లో న్యారో గేజ్‌ను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.
స్టాండర్డ్ గేజ్‌ను మెట్రో మార్గాలలో ఉపయోగిస్తున్నారు.
పొడవైన రైలు మార్గాలు ఉన్న రాష్ట్రాలు
1. ఉత్తరప్రదేశ్ - 9077 కి.మీ.
2. రాజస్థాన్ - 5893 కి.మీ.
3. మహారాష్ట్ర - 5745 కి.మీ.
4. గుజరాత్ - 5258 కి.మీ.
రైలు మార్గాలు తక్కువ ఉన్న రాష్ట్రాలు
1. సిక్కిం - అస్సలు లేవు. 2. మణిపూర్ - 1.35 కి.మీ.
3. మిజోరాం - 1.5 కి.మీ.
4. మేఘాలయ - 8.76 కి.మీ.
కొంకణ్ రైల్వే ప్రాజెక్టు
భారతదేశంలో మొట్టమొదటి సారిగా ప్రైవేట్ రంగంలో నిర్మించిన రైల్వే మార్గం. ఫ ఈ రైలు మార్గం పొడవు 760 కి.మీ.
ఈ ప్రాజెక్టును 1998 జనవరి 26న ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం
ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్న రాష్ట్రాలు- కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర
ఈ రైల్వే మార్గంలో అతి పొడవైన సొరంగ మార్గం ‘ఖార్దుబ్ టన్నెల్’(ఈ సొరంగం పొడవు సుమారుగా 6.5 కి.మీ.).
కొంకణ్ రైలు మార్గం మహారాష్ట్రలోని రోహను కర్ణాటకలోని మంగళూరును కలుపుతుంది.
ఈ ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం నవీ ముంబైలో ఉంది.
-వి.వెంకట్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ