Share News

Universities Posts: ఏపీ వర్సిటీల్లో కొలువులు.. ఖాళీలెన్నంటే..!

ABN , First Publish Date - 2023-11-03T16:25:28+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Universities Posts: ఏపీ వర్సిటీల్లో కొలువులు.. ఖాళీలెన్నంటే..!

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 3,220 ఖాళీలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్‌లాగ్‌, 2,942 రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీలు విడి విడిగా నోటిఫికేషన్లు విడుదల చేశాయి.

1. ప్రొఫెసర్‌: 418 పోస్టులు

2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 801 పోస్టులు

3. ట్రిపుల్‌ఐటీ లెక్చరర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 2,001 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో పీజీ, ఎంఫిల్‌/పీహెచ్‌డీ, యూజీసీ/సీఎ్‌సఐఆర్‌ నెట్‌/ఏపీ స్లెట్‌/సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: స్ర్కీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, ధ్రువ పత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

స్ర్కీనింగ్‌ టెస్ట్‌: దీన్ని ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. మొత్తం 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉం టాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. తప్పుగా గుర్తించిన సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, అకడమిక్‌ స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. వర్సిటీల్లో ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్ఠంగా 10 మార్కుల వెయిటేజీ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ఓపెన్‌ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2,500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. రూ.2,000. ఒకటి కంటే ఎక్కువ విభాగాల్లో పరీక్షలు రాయాలనుకుంటే మాత్రం విడివిడిగా రుసుము చెల్లించాలి. ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.3,000 చెల్లించాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు తుది గడువు: నవంబరు 20

పోస్టు ద్వారా దరఖాస్తు కాపీ, ఇతర ధ్రువపత్రాల సమర్పణకు గడువు: నవంబరు 27

వెబ్‌సైట్‌: recruitments.universities.ap.gov.in/

Updated Date - 2023-11-03T16:25:32+05:30 IST