Share News

India:ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో ప్రాణ నష్టంపై భారత్ ఆందోళన

ABN , First Publish Date - 2023-10-25T09:16:12+05:30 IST

ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) ల మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతుండటంపై భారత్(India) ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి(UN) భద్రతామండలిలో రాయబారి ఆర్ రవీంద్ర ఇదే అంశంపై మాట్లాడారు

India:ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో ప్రాణ నష్టంపై భారత్ ఆందోళన

ఢిల్లీ: ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) ల మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతుండటంపై భారత్(India) ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి(UN) భద్రతామండలిలో రాయబారి ఆర్ రవీంద్ర ఇదే అంశంపై మాట్లాడారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, ప్రాణనష్టం గురించి భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని అన్నారు. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంతో సహా మధ్య ప్రాచ్యంలోని పరిస్థితిపై ఐరాస భద్రతా మండలిలో బహిరంగ చర్చ సందర్భంగా భారత్ తరఫున రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


"అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన ఉగ్రదాడులు దిగ్భ్రాంతిని కలిగించాయి. మేము వాటిని ఖండిస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ(PM Modi) సంతాపం తెలియజేశారు. ఇజ్రాయెల్ పై ఉగ్రవాద దాడులు(Terror Attacks) చేసినప్పుడు వారికి మేం అండగా నిలబడ్డాం" అని ఆయన అన్నారు. గాజా స్ట్రిప్ లోని పౌరులకు మానవతా సాయం చేయడానికి ఇండియా చేస్తున్న ప్రయత్నాలను రవీంద్ర వివరించారు. గాజాకు 38 టన్నుల ఆహారం, రూ.కోట్లు విలువ చేసే వైద్య పరికరాలను పంపినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ -పాలస్తీనా మధ్య సామరస్యపూర్వక చర్చలు జరిపేందుకు భారత్ కృషి చేస్తోందని అన్నారు. ఈ అంశంలో ఇజ్రాయెల్ కు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, టెక్నాలజీ తదితర రంగాల్లో ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కలిగి ఉంటాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ - పాలస్తీనా వివాదం సద్దుమణగడానికి ప్రపంచ దేశాలు కృషి చేయాలిన ఆయన కోరారు.

Updated Date - 2023-10-25T09:17:59+05:30 IST