Share News

Sundar Pichai: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. గూగుల్ సీఈఓకు హెచ్చరిక..!

ABN , First Publish Date - 2023-10-14T21:19:24+05:30 IST

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించి హింసాత్మక దృశ్యాలో యూట్యూబ్‌ ఉన్న విషయాన్ని ఐరోపా సమాఖ్య గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దృష్టికి తీసుకెళ్లింది. వీటిని తక్షణం తొలగించాలని కోరింది. నిబంధనలు పాటించని పక్షంలో సంస్థపై జరిమానా విధించాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది.

Sundar Pichai: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. గూగుల్ సీఈఓకు హెచ్చరిక..!

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించి హింసాత్మక అసత్య కంటెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనేక అవాస్తవ కథనాల తాలూకు వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరోపా సమాఖ్య అప్రమత్తమైంది. వివిధ ఆన్‌లైన్ వేదికలపై దృష్టి సారించింది. వీటి వ్యాప్తికి కారణమవుతున్న ఎక్స్‌పై ఈయూ ఇప్పటికే దర్యాప్తు మొదలెట్టింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటాను కూడా హెచ్చరించింది.

Viral Video: భర్తతో రొమాంటిక్ ట్రిప్‌పై వెళ్లిన మహిళ.. రైల్లో ప్రయాణిస్తుండగా షాకింగ్ సీన్..వీడియో రికార్డు చేసి నెట్టింట షేర్ చేస్తే..


ఈ నేపథ్యంలో తాజాగా గూగుల్(Google) సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్‌ను(Sundar pichai) కూడా ఈయూ(EU) హెచ్చరించింది. హింసాత్మక, అవాస్తవ కంటెంట్‌ యూట్యూబ్‌లో వైరల్ అవుతోందంటూ పేర్కొంది. ఇలాంటి కంటెంట్ వ్యాప్తికి కట్టడి చేసేందుకు ఈయూ తెచ్చిన డిజిటల్ చట్టాన్ని గురించి కూడా తన లేఖలో ప్రస్తావించిన ఈయూ వీటి కట్టడికి చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఈ విషయంలో కంపెనీ అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి కంటెంట్‌ను తొలగించాలని హెచ్చరించింది. కచ్చితంగా ఈయూ నిబంధనలకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది(EU Reminds Pichai To Remove Disinformation On YouTube).

Viral: ఇంటి పనుల్లో భార్యకు సాయం చేయనన్న వ్యక్తిపై ప్రశంసల వర్షం.. ఇతడి లాజిక్‌కు జనాలు ఫిదా!


మైనర్ల గోప్యత, భద్రత దృష్ట్యా ఈ కంటెంట్ వ్యాప్తికి తక్షణం అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించి అవసరమైతే ప్రభుత్వ అధికారులు, యూరోపోల్‌ను కూడా సంప్రదించాలని సూచించింది. ఈ విషయాన్ని సుందర్ పిచాయ్‌తో పాటూ యూట్యూబ్ సీఈఓకు కూడా స్పష్టం చేసింది. ‘‘ఈయూలో మీ ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగిస్తున్న లక్షలాది మంది పిల్లలు, టీనేజర్లను రక్షించేందుకు కంటెంట్ విషయంలో మీ కంపెనీ నిర్దష్ట నిబంధనలు పాటించాలి’’ అని లేఖ ద్వారా తెలియజేసింది. నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తేలితే పెనాల్టీ కూడా వేస్తామని హెచ్చరించింది.

Viral: వింత వ్యాధి..77 ఏళ్లు వచ్చినా బ్రహ్మచారిగా మిగిలిపోడానికి ఇతడు చెప్పిన కారణం తెలిస్తే..

Updated Date - 2023-10-14T21:19:27+05:30 IST