Aadhaar Linking: నేటితో ముగియనున్నఆధార్ అనుసంధానం
ABN , First Publish Date - 2023-02-15T07:31:27+05:30 IST
రాష్ట్రంలో విద్యుత్ మీటర్లకు ఆధార్ నంబరు అనుసంధాన ప్రక్రియకు విధించిన గడువు బుధవారంతో ముగియనుంది. గడువులోగా విద్యుత్

- లింక్ చేయకుంటే విద్యుత్ బిల్లులు చెల్లించడం అసాధ్యం
అడయార్(చెన్నై), ఫిబ్రవరి 14: రాష్ట్రంలో విద్యుత్ మీటర్లకు ఆధార్ నంబరు అనుసంధాన ప్రక్రియకు విధించిన గడువు బుధవారంతో ముగియనుంది. గడువులోగా విద్యుత్ మీటర్లకు ఆధార్ నంబరును అనుసంధానం చేయకుంటే విద్యుత్ బిల్లులు(Electricity bills) చెల్లించడం సాధ్యం కాదని తమిళనాడు విద్యుత్ బోర్డు (టీఎన్‌ఈబీ) ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. వంద యూనిట్ల రాయితీ పొందే గృహ వినియోగదారులు తమ విద్యుత్ కనెక్షన్ నెంబరుకు ఆధార్ అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. గత యేడాది నవంబరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2811 శిబిరాలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వంద యూనిట్ల లోపు విద్యుత్ రాయితీ పొందేవారు సుమారు 2.67 కోట్ల మంది ఉన్నారు. సోమవారం వరకు వీరిలో 2.65 కోట్ల మంది తమ ఆధార్(Aadhaar) నంబరు అనుసంధానం చేశారు. ఇంకా మరో రెండు లక్షల మంది అనుంధానం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీరికి విధించిన గడువు బుధవారంతో ముగియనుంది. ఈ గడువును ఇప్పటికే మూడు సార్లు పొడిగించారు. ఇకపై పొడిగించేందుకు అవకాశమే లేదని టీఎన్‌ఈబీ అధికారులు అంటున్నారు. అందువల్ల ఆధార్ నంబరును అనుసంధానం చేయని వారు తక్షణం అనుసంధానం చేయాలని కోరారు. ఇలా చేయని పక్షంలో వచ్చే నెల నుంచి విద్యుత్ బిల్లులను చెల్లించేందుకు అకాశం ఉండదని వారు హెచ్చరిస్తున్నారు.
ఇదికూడా చదవండి: మోదీ దగ్గర ఆ కళ నేర్చుకున్నాను : స్టాలిన్