Agniveers: అగ్నివీర్స్ తొలి బ్యాచ్ శిక్షణ పూర్తి

ABN , First Publish Date - 2023-03-28T22:51:21+05:30 IST

అగ్నివీర్స్(Agniveers) మొదటి బ్యాచ్(1st Batch) శిక్షణ పూర్తయింది. నాలుగు నెలల సుదీర్ఘ శిక్షణ తర్వాత మంగళవారం ఒడిశా( Odisha)లోని ఐఎన్‌ఎస్ చిల్కా(INS Chilka Odisha)లో 2,585 అగ్నివీర్లతో కూడిన మొదటి బ్యాచ్‌ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది.

Agniveers: అగ్నివీర్స్ తొలి బ్యాచ్ శిక్షణ పూర్తి

ఒడిశా: అగ్నివీర్స్(Agniveers) మొదటి బ్యాచ్(1st Batch) శిక్షణ పూర్తయింది. నాలుగు నెలల సుదీర్ఘ శిక్షణ తర్వాత మంగళవారం ఒడిశా( Odisha)లోని ఐఎన్‌ఎస్ చిల్కా(INS Chilka Odisha)లో 2,585 అగ్నివీర్లతో కూడిన మొదటి బ్యాచ్‌ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ సాయంత్రం నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో కొత్తగా రిక్రూట్ అయిన అగ్నివీర్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ బ్యాచ్‌లో 272 మంది మహిళా అగ్నివీరులు ఉండడం విశేషం. భారత సాయుధ దళాలలో ఇదే మొదటిది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ పీటీ ఉష, ప్రముఖ మాజీ క్రీడాకారిణి, క్రికెటర్ మిథాలీ రాజ్ హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన అగ్నివీరులకు పతకాలు, ట్రోఫీలను అందజేశారు.

Agniveers-2.jpg

ఆసియాలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన చిలికా సరస్సు వద్ద శిక్షణ పొందిన ఈ అగ్నివీర్‌లను సముద్ర శిక్షణ కోసం ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకల్లో మోహరిస్తామని అధికారులు తెలిపారు. INS చిల్కా అకాడమీ శిక్షణలో విధి, గౌరవం, ధైర్యం వంటి ప్రధాన నౌకాదళ విలువలపై ఆధారపడి సర్వీస్, అవుట్‌డోర్ శిక్షణ ఉంటుందని వారు తెలిపారు.

Agniveers-3.jpg

అగ్నివీరులు తమ కెరీర్‌లో రాణించాలనే కోరిక, నేర్చుకోవాలనే సంకల్పం,నిబద్ధతతో బలమైన పునాదిని పెంపొందించుకోవాలని అడ్మిరల్ హరికుమార్ కోరారు. దేశ నిర్మాణ సాధనలో నావికాదళం ప్రధాన విలువలైన విధి, గౌరవం, ధైర్యాన్నినిలబెట్టాలని అగ్నివీరులను కోరారు.

Updated Date - 2023-03-28T23:07:48+05:30 IST