AIIMS Madurai: మదురై ఎయిమ్స్‌.. శాశ్వత ఉద్యోగి ఒక్కరూ లేరు

ABN , First Publish Date - 2023-02-17T09:09:13+05:30 IST

మదురై ఎయిమ్స్‌(AIIMS Madurai) ఆస్పత్రికి సంబంధించి శాశ్వతంగా ఒక్క ఉద్యోగిని కూడా నియమించలేదని, కాంట్రాక్ట్‌ పద్ధతిలో 8 మందిని

AIIMS Madurai: మదురై ఎయిమ్స్‌.. శాశ్వత ఉద్యోగి ఒక్కరూ లేరు

- కాంట్రాక్ట్‌ పద్ధతిలో 8 మంది నియామకం

పెరంబూర్‌(చెన్నై), ఫిబ్రవరి 16: మదురై ఎయిమ్స్‌(AIIMS Madurai) ఆస్పత్రికి సంబంధించి శాశ్వతంగా ఒక్క ఉద్యోగిని కూడా నియమించలేదని, కాంట్రాక్ట్‌ పద్ధతిలో 8 మందిని మాత్రమే నియమించారు. మదురై తోపూర్‌లో ఎయిమ్స్‌ ఆస్పత్రి నిర్మిస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించగా, 2019 జూన్‌ 27న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపక చేశారు. ఇప్పటి వరకు ప్రహరీ గోడ మాత్రమే నిర్మించగా, భవనాలు ప్రారంభించిన దాఖలా లేదు. ఈ వ్యవహారంపై ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో డీఎంకే ఎంపీ(DMK MP)లకు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ మాండవియా మధ్య వాగ్వివాదం కూడా చోటుచేసుకుంది. కాగా, ఎయిమ్స్‌ వైద్యకళాశాలలో అడ్మిషన్లు ప్రారంభించి రామనాథపురం వైద్యకళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ బదులు సమాధానమిచ్చింది. మదురై ఎయిమ్స్‌ ఆస్పత్రికి 184 ప్రొఫెసర్లు, 32 మంది బోధనేతర సిబ్బంది నియమించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధించి శాశ్వత నియామకాలు చేపట్టకపోగా, 8 మందిని కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించి, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టలేదని కేంద్రం తెలిపింది.

Updated Date - 2023-02-17T09:09:15+05:30 IST