Amit Shah: మాజీసీఎంకు షాకిచ్చిన అమిత్‌ షా.. ఫిఫ్టీ.. ఫిఫ్టీ అంటూ.. అసలు విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-09-16T08:49:44+05:30 IST

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాల్లో తమకు 20 కేటాయించాలని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి

Amit Shah: మాజీసీఎంకు షాకిచ్చిన అమిత్‌ షా.. ఫిఫ్టీ.. ఫిఫ్టీ అంటూ..  అసలు విషయం ఏంటంటే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాల్లో తమకు 20 కేటాయించాలని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah) అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (Former CM Edappadi Palaniswami)కి సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యేక ఓటు బ్యాంక్‌ వున్న నియోజకవర్గాలతో పాటు 20కి తగ్గకుండా కేటాయించాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎన్నో ఆశలతో ఢిల్లీ వెళ్లిన ఈపీఎస్‌ అతడి నోటి నుంచి వచ్చిన మాటలు విని ఖంగుతిన్నట్లు సమాచారం. గురువారం రాత్రి ఢిల్లీలో అమిత్‌షాతో భేటీ అయిన ఈపీఎస్‌ లోక్‌సభ ఎన్నికలపై గంటకు పైగా చర్చించారు. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా తంబిదురై తదితర ఎంపీలను వెంటబెట్టుకుని బీజేపీ జాతీయ నాయకులను కలుసుకునే ఈపీఎస్‌ ఈసారి ఒంటరిగానే అమిత్‌ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో డీఎంకే(DMK) కూటమిని మట్టికరిపించేందుకు తీసుకోవాల్సిన వ్యూహం పై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

nani3.jpg

అన్నాడీఎంకే కూటమిలో ప్రస్తుతమున్న మిత్రపక్షాలనూ కొనసాగించాలని అమిత్‌షా సూచించగా, ఇందుకు ఈపీఎస్‌ విముఖత కనబరిచినట్లు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి మరిన్ని పార్టీలు కూటమిలో చేరే అవకాశాలున్నాయని, వాటిని కూడా చేర్చుకున్న తరువాత ఎవరిని దూరంగా పెట్టాలన్నదానిపై ఒక నిర్ణయానికి వద్దామని సూచించినట్లు సమాచారం. సీనియర్‌ నటుడు విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకేను కూటమిలోకి చేర్చుకోవడంపై ఇద్దరు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు సరేనన్న అమిత్‌షా.. తమ పార్టీకి మాత్రం 20 సీట్లు కావాల్సిందేనని తెగేసి చెప్పినట్లు తెలిసింది. అక్టోబర్‌ నెలాఖరున లేదా నవంబర్‌ మొదటివారంలో రాష్ట్ర పర్యటనకు వస్తానని, ఆ సమయంలో సీట్ల కేటాయింపుపై మరో విడత చర్చిద్దామని అమిత్‌షా చెప్పడంతో ఈపీఎస్‌ మౌనం దాల్చినట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - 2023-09-16T08:55:33+05:30 IST