PM Modi: త్వరలో అందుబాటులోకి ‘భాషిణి’: మోదీ

ABN , First Publish Date - 2023-08-20T03:54:28+05:30 IST

దేశంలో అనేక రకాల ప్రాంతీయ భాషలు ఉన్నాయని, వీటిని చిటికలో అనువదించేలా ‘భాషిణి’ అనే వేదికను రూపొందిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

PM Modi: త్వరలో అందుబాటులోకి ‘భాషిణి’: మోదీ

బెంగళూరు/న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశంలో అనేక రకాల ప్రాంతీయ భాషలు ఉన్నాయని, వీటిని చిటికలో అనువదించేలా ‘భాషిణి’ అనే వేదికను రూపొందిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భాషిణి.. త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. కృత్రిమ మేథ(ఏఐ)తో పనిచేసే భాషిణి అన్ని డిజిటల్‌ మాధ్యమాలను సపోర్టు చేస్తుందన్నారు. ఈ మేరకు బెంగళూరులో శనివారం జరిగిన జీ-20 డిజిటల్‌ ఎకానమీ వర్కింగ్‌ గ్రూప్‌ మంత్రుల సదస్సును ఉద్దేశించి ప్రధాని వర్చువల్‌గా ప్రసంగించారు. అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో భారత్‌ ఆదర్శవంతమైన ప్రయోగశాలగా మారిందన్నారు. ‘‘భారత దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. డజన్లకొద్దీ భాషలు, మాండలికాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి మతానికీ, అసంఖ్యాకమైన సంస్కృతులకు పుట్టిల్లు’’ అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్లు దాటింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-20T03:54:28+05:30 IST