Share News

parliamentary panel recommendations: ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ పెంచండి

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:07 AM

ఎస్సీ, ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ను పెంచాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సూచించింది. ఉపకార వేతనాల మంజూరులో జాప్యం లేకుండా పథకాల సమీక్ష అవసరమని పేర్కొంది

parliamentary panel recommendations: ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ పెంచండి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: షెడ్యూలు కులాలు, ఓబీసీ, ఈబీసీ కులాలకు చెందిన విద్యార్థులకు మంజూరు చేసే ఉపకార వేతనాన్ని పెంచాలని పార్లమెంటరీ స్థాయి సంఘం ఒకటి కేంద్రానికి సూచించింది. ఉపకార వేతన పథకాలనూ సమీక్షించాలని కోరింది. సామాజిక న్యాయం, సాధికారతపై పార్లమెంటరీ స్థాయి సంఘం ఈమేరకు కేంద్రానికి సూచనలు చేసింది. ఉపకార వేతనాల మంజూరులో ఆలస్యాన్ని నివారించాలని తెలిపింది. లోక్‌సభ ముందుంచిన ఆ నివేదికలో... ఏటా ప్రతి విద్యార్థికి ఇస్తున్న ఉపకార వేతనం వారి చదువులకయ్యే ఖర్చులకు సరిపోదని పేర్కొంది. ప్రతి పథకంలో మంజూరు చేసే ఉపకార వేతనాలను కాలానుగుణంగా సమీక్షించాలని కోరింది. అప్పుడే అవి విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

Summer Icecream: వేసవిలో ఐస్ క్రీం తింటున్నారా లేదా ఫ్రోజెన్ డెజర్ట్ తింటున్నారా.. రెండింటికీ తేడా ఏమిటి..

AP Police Search For Kakani: హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి ఏపీ పోలీసులు..

Updated Date - Apr 03 , 2025 | 04:07 AM