Earthquake: ఖాట్మండు, అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం

ABN , First Publish Date - 2023-04-01T08:14:33+05:30 IST

నేపాల్ దేశంలోని ఖట్మండు, భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం భూకంపం సంభవించింది....

Earthquake: ఖాట్మండు, అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం
Earthquake

న్యూఢిల్లీ: నేపాల్ దేశంలోని ఖట్మండు, భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం భూకంపం సంభవించింది.(Kathmandu,Andaman and Nicobar) నేపాల్ దేశ రాజధాని నగరమైన ఖట్మండ్ లో శనివారం తెల్లవారుజామున 3.04 గంటలకు భూకంపం(Earthquake) వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. 25కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైందని అధికారులు చెప్పారు. ఫిబ్రవరి నెలలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. గతంలో సంభవించిన భూకంపం వల్ల నేపాల్ దేశంలో భారీ నష్టం సంభవించింది.

భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లోనూ శుక్రవారం రాత్రి 11.56 గంటలకు భూకంపం సంభవించింది. 28 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. మార్చి 24వతేదీన కూడా అంబికాపూర్, ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల్లో భూమి కంపించింది. పోర్ట్ బ్లెయిర్ కు 140 కిలోమీటర్ల దూరంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ట్వీట్ చేసింది.

Updated Date - 2023-04-01T08:30:12+05:30 IST