Former Chief Minister: ఆయన్ను ప్రధాన కార్యదర్శిగా గుర్తించొద్దు
ABN , First Publish Date - 2023-04-19T08:27:10+05:30 IST
కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను ప్రధాన కార్యదర్శి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami)ని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కోరుతూ ఆ పార్టీ బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం (O. Panneerselvam) మళ్ళీ పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తాను ఎన్నికైన విషయాన్ని అంగీకరించేలా కేంద్ర ఎన్నికల సం ఘానికి ఉత్తర్వులివ్వాలని కోరుతూ మాజీ సీఎం పళనిస్వామి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవ ల ఆ పిటిషన్‌పై విచారణ జరిగినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు హాజరై ఈపీఎస్ ఎన్నిక, అన్నాడీఎంకేలో తాజాగా చేసిన సవరణలు ప్రకటించేందుకు పది రోజుల గడువు కోరారు. ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi) ఆ మేరకు అనుమతి జారీ చేసింది. ప్రస్తు తం ఢిల్లీ హైకోర్టు రెండు మూడు రోజుల్లోపు ఈపీఎస్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఓపీఎస్ తరఫున బెంగళూరు(Bangalore) పుగళేంది ఇటీవల ఢిలీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ వినతి పత్రం సమర్పించారు. ఈపీఎ్‌సను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యదర్శిగా అంగీకరించకూడదని కోరారు. ఇదే విధంగా మంగళవారం ఉదయం ఓపీఎస్ తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి మరో పిటిషన్‌ను సమర్పించారు. అన్నాడీఎంకే సమన్వయకర్తగా తానింకా కొనసాగుతుండటంతో ఈపీఎ్‌సను పార్టీ ప్రధాన కార్యదర్శిగా అంగీకరించడానికి వీలులేని ఆ పిటిషన్‌లో స్పష్టం చేశారు.
ఇదికూడా చదవండి: రూ.9 వేల నుంచి రూ.6 వేలకు.., ఎలా బతకాలో చెప్పండి..